Suryaa.co.in

Andhra Pradesh

మాదకద్రవ్యాల వెనుక జగన్మోహన్ రెడ్డి

ఇంత పెద్ద సాహసాన్ని మరొకరు చేసే అవకాశమే లేదు
జే మద్యం బ్రాండ్లలో వాడే ఈస్ట్ అంత కాస్ట్లీ ది కాదు
జే బ్రాండ్స్ ఉత్పత్తి అయ్యే ఆల్కహాల్ ప్లాంట్లను తనిఖీ చేయాలి
కూనం వీరభద్రరావు ప్రాణానికి ప్రమాదం

– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

విశాఖపట్నం పోర్టులో దిగుమతి అయిన మాదకద్రవ్యాల వెనుక ఉన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేనని, ఇంకా ఎవరు కూడా ఇంత పెద్ద సాహసం చేసే అవకాశం లేనేలేదని, ఈ విషయం అందరికీ తెలుసునని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయిందని, డ్రగ్స్ అనే పదాన్ని ‘ఉచ్చ ‘ రించడానికి కూడా పోసుకున్నారని, భయంతో వణి కిపోయారన్నారు.

దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పుడు ముందుగానే ఎదురు దాడిని ప్రారంభించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరిపై నీలాపనిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికల్లో బిజెపిని ముందుండి నడపాల్సిన దగ్గుబాటి పురందరేశ్వరిపై నోటికొచ్చినట్లు సాక్షి దినపత్రికలో నా నా కారు కూతలను కూస్తున్నారని మండిపడ్డారు.

సత్యమేవ జయతే అంటూ ఒక్క సత్యమైన రాశారా?

సత్యమే వజయతే అని సాక్షి దినపత్రిక కు ట్యాగ్ లైన్ పెట్టుకొని ఒక్క సత్యమైన రాశారా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. విశాఖపట్నం పోర్టులో పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ 50 వేల కోట్లని సాక్షి దినపత్రికలోనే రాశారని పేర్కొన్నారు. అందులో 1/5 వంతు లో 10 శాతం అంటే రెండున్నర టన్నులు, అది కూడా ఫ్యూ రెస్ట్ ఫామ్ అయితే దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. సింగల్ లాట్ రెండున్నర టన్నులు డ్రగ్స్ ను సినిమాలలో కూడా ఇంత వరకు చూపించలేదని చెప్పారు. ఇటీవల విడుదలైన సైంధవ తెలుగు సినిమా కథాంశం పూర్తి గా డ్రగ్స్ చుట్టే తిరుగుతుందన్నారు.

అందులోనూ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నట్లు ప్రేక్షకులకు చూపిస్తారన్నారు. ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్ వ్యవహారాలు చేయగలిగే సమర్థత నూటికి నూరుపాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకే సాధ్యమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే, 50 వేల కోట్లు ఖర్చుపెట్టి విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చి తెదేపా, బిజెపి నేతలు పంచే ప్రయత్నాన్ని చేస్తున్నారని సాక్షి దినపత్రికలో వార్తలు రాయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

ఈ లెక్కన, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలను పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వై చిప్స్ మాట్లాడుతున్నారంటే, వారి దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఏముంటుందని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ మహమ్మారి వెనుక ఉన్నది వీళ్లేనని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మరోసారి పునరుద్గాటించారు.

అసలు కథ ఇది…!

మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్న తన ప్రియుడిని చంపేస్తే,
సౌత్ అమెరికా కేంద్రంగా ఒక లేడీ పెద్ద డాన్ గా ఎదుగుతుందని, ఇదంతా బ్రెజిల్, మెక్సికోలో జరిగినట్లు ఒక విదేశీ వెబ్ సిరీస్ లో చూపించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. మెక్సికో, బ్రెజిల్ ప్రాంతాలలో జరిగే మద్యం ఉత్పత్తిలో టెకీలా అనే ఒక బ్రాండ్ ను ప్రత్యేకంగా రూపొందిస్తారు. మనదేశంలో ఎలావిరో మాదిరిగా వేడి ప్రాంతంలో ఒక పుష్పం పుడుతుందని చెప్పారు.

దాన్ని చెరుకు గడ నుంచి రసం మాదిరిగా తీసి, దానిలోని ముడి పదార్థం ద్వారా రూపొందించే పదార్థాన్నే టెకీలా అని అంటారని రఘు రామ కృష్ణంరాజు వివరించారు. టెకీలా ఉత్పత్తిలో డ్రగ్స్ లోని ఈస్ట్ పౌడర్ కలిపి, మద్యానికి బానిస అయిన వారికి విక్రయిస్తారన్నారు. ఆల్కహాల్ కంటే ఈస్ట్ పౌడర్ కలిపిన టెకీలా కు ధర ఎక్కువగా నిర్ణయిస్తారని తెలిపారు. కరోనా సమయంలో నేను ఈ వెబ్ సిరీస్ చూశానని, జే బ్రాండ్ మద్యం ఉత్పత్తిలోను ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా 80 నుంచి 89 ఏళ్ల వయసున్న ఒక ప్రొఫెసర్ నాకు ఫోన్ చేసి చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

జే మద్యం బ్రాండ్లలో వాడే ఈస్ట్ అంత కాస్ట్లీ ది కాదు

జగన్మోహన్ రెడ్డి అతని లిక్కర్ గ్యాంగ్ మద్యం ఉత్పత్తిలో ఉపయోగించే ఈస్ట్ అంత కాస్ట్లీ ది కాదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. విశాఖపట్నంలో పట్టుబడిన మాదకద్రవ్యాలలో ఓ పి యం ఉన్నట్లుగా శాంపిల్స్ ద్వారా తేలిందన్నారు. ఓపియం అనేది ఒక పువ్వు ద్వారా వచ్చే పౌడర్ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులోని కొన్ని ఫార్మా కంపెనీలు కూడా డ్రగ్స్ ను తయారు చేస్తూ, పట్టుబడినట్లు వార్తల్లో చూశామన్నారు. ఓ రెండు మూడు కంపెనీలు ఫార్మా రంగంలో అధిక పురోగతిని సాధించడానికి ఇదే కారణమై ఉంటుందన్నారు.

మద్యం ఉత్పత్తిలో ఓపియం, కోకైన్, గంజాయి, ఈస్ట్ వంటి కొద్ది మోతాదు పదార్థాలు కలిపి తయారుచేసిన చెత్త ఆల్కహాల్ కు కూడా 200 నుంచి 225 రూపాయలకు, చివరకు 250 రూపాయలకు విక్రయిస్తున్న మద్యపాన ప్రియులు తాగకుండా ఇండ్లకు వెళ్లలేని దుస్థితి నెలకొందని రఘు రామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు వెళ్లడం లేదని ఆరా తీస్తే, మాదకద్రవ్యాల ఆనవాళ్లు కలిగిన చెత్త మద్యం సేవించిడానికి వారు బానిసలైయ్యారని తెలుస్తోందన్నారు. ఈ మూడు నాలుగేళ్లలో మద్యం సేవించి మృతి చెందిన వారి సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉందన్నారు.

ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి గణాంకాలతో సహా వెల్లడించారని గుర్తు చేశారు. అందుకే, మాదకద్రవ్యాల దిగుమతి వ్యవహారంలో ఆమె పేరును లాగుతూ, అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాన్ని సాక్షి దినపత్రిక యాజమాన్యం చేస్తోందన్నారు. ఈస్ట్ అనే డ్రగ్ మెటీరియల్ తక్కువ ధరకే లభిస్తుండడంతో, దాన్ని మధ్యలో కలిపి విక్రయించడం ద్వారా విపరీతంగా లిక్కర్ సేల్స్ పెంచుకోవడమే కాకుండా, అమ్మిన లిక్కర్ లో 50% బ్లాక్ లో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వెనక్కి లాగేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మద్యం విక్రయాలన్నీ జగన్మోహన్ రెడ్డి నగదు ద్వారానే కొనసాగిస్తున్నారని, వచ్చిన నగదులో 50 శాతాన్ని ఆయన వెనక్కి తీసుకుంటున్నారన్నారు. క్యూరిఫైడ్ చేసుకొని డ్రగ్స్ ను విక్రయించుకునే దానికంటే, మద్యం ఉత్పత్తిలో కలిపి, ఆ మద్యాన్ని విక్రయించడం ద్వారానే వారికి అధిక లాభాలు వస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు . జై గ్యాంగ్ ఉత్పత్తి చేస్తున్న మద్యాన్ని పరీక్షించాలని అందులో కచ్చితంగా మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉంటాయన్నారు.

వ్యక్తిగత స్వార్థం కోసం మానవ జీవితాల విధ్వంసం

జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం మానవ జీవితాలను విధ్వంసం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. నేను రాజా ద్రోహిని అయితే, వారు రాయల్ ఫ్యామిలీ కి చెందిన కింగ్ జార్జ్, క్వీన్ విక్టోరియా అని అపహాస్యం చేసిన ఆయన, ఈ రకమైన నకిలీ మద్యాన్ని తయారుచేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. డాగ్ స్క్వాడ్ కావాలని అంటే సంఘటనా స్థలానికి వెళ్ళినట్టు ఐజి స్థాయి అధికారి పేర్కొనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

ఎప్పుడైనా, ఎక్కడైనా డాగ్ స్క్వాడ్ ను కానిస్టేబుల్, మహా అయితే హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులే పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. అంతేకానీ ఐజి స్థాయి అధికారి ఎక్కడా కూడా డాగ్ స్క్వాడ్ ను పర్యవేక్షించిన దాఖలాలు లేవన్నారు. కుక్కలను అడిగితే పంపామని చెప్పిన ఐజి స్థాయి అధికారి, కుక్కలు వచ్చాయో రాలేదో తెలియదు కానీ ఐజి స్థాయి అధికారి మాత్రం సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు.

ఐజి స్థాయి అధికారి సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లారన్నది ఇప్పటికి బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. రాష్ట్ర పోలీసు అధికారులు జోక్యం చేసుకొని, తమని ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని చేశారని సిబిఐ అధికారులు చెబుతుండగా, తాము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని రాష్ట్ర పోలీసులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జే బ్రాండ్స్ ఉత్పత్తి అయ్యే ఆల్కహాల్ ప్లాంట్లను తనిఖీ చేయాలి

మాదకద్రవ్యాల ఆనవాళ్ల కోసం ఆక్వా ప్లాంట్లను తనిఖీ చేయాలనుకుంటున్న సిబిఐ అధికారులు, జే బ్రాండ్ మద్యం ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీలకు, బాటిలింగ్ ప్లాంట్లకు వెళ్లి తనఖీ లు చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అందులో నుంచి రెడ్ హ్యాండెడ్ గా నమూనాలు సేకరించాలని కోరారు. అందులో ఏమాత్రం మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభించిన ఆ మాత్రం ఆనవాళ్లు చాలు … జీవితాలు సర్వనాశనం కావడానికని అన్నారు.

ఎంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారో వినియోగించాలని, ఈ ఉపద్రవం నుంచి ప్రజలని కాపాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు. జే బ్రాండ్స్, తొకడ మద్యం ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీల నుంచి ఇప్పటికే ఈస్ట్ తరలించి ఉంటారు. ఈస్ట్ తరలించిన దాని గురించి ఫ్యాక్టరీలలో పని చేసే వారిని వాకబు చేయాలన్నారు. గతంలో వైజాగ్ పోర్టుకు ఈస్ట్ వచ్చిన తేదీలను, ఇక్కడికి స్టాక్ వచ్చిన తేదీలను ఒక్కసారి సిబిఐ అధికారులు పరిశీలించాలన్నారు.

కూనం వీరభద్రరావు ప్రాణానికి ప్రమాదం

సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని కూనం వీరభద్రరావు ప్రాణానికి ప్రమాదం ఉందని, ఆయన్ని ఖర్చు కింద రాసి… ఇతరుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. కూనం వీరభద్రరావు పై మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్న వారు, తమతో నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాలని ఒత్తిడి చేస్తారన్నారు. వీరభద్రరావుకు సిబిఐ అధికారులు తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఖర్చుగా రాసి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు బిటెక్ రవి, బిజెపి నాయకులు ఆదినారాయణ రెడ్డి ల ఖాతాలో జమ చేసే ప్రయత్నం చేశారన్నారు.

ఇప్పుడేమో వైఎస్ సునీతా రెడ్డి భర్త చంపాడని కొత్త కథ మొదలుపెట్టారన్నారు. ఖర్చు వీళ్లు రాసి ఇతరుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని, ఇప్పుడు కూనం వీరభద్రరావును కూడా ఖర్చు చేసి, దగ్గుబాటి పురందరేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు ఖాతాలలో జమగా రాసే స్కీం వేసినట్లు అనిపిస్తోందన్నారు. ముందు చూపుతో నేను ఈ విషయాన్ని చెబుతున్నానని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జేబ్రాండ్లను పరీక్షించే వరకు, మద్యపాన ప్రియులు మద్యం సేవించడం నిలిపివేయాలన్న రఘురామ కృష్ణంరాజు, జే బ్రాండ్లు చెత్త అయినా కిక్కు కోసం తాగుతున్నారన్నారు.

25 టన్నుల మాదకద్రవ్యాల జగన్మోహన్ రెడ్డి కూడా దిగుమతి చేసుకోలేరని, అంత మొత్తంలో నిజమైన మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారు ఉంటారని నాకున్న సినిమా పరిజ్ఞానంతో అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కేవలం 100 కోట్ల కుంభకోణంలోనే అదుపులోకి తీసుకున్నప్పుడు, ఎప్పటినుంచో జరుగుతున్న వేలకోట్ల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

గతంలో టాల్కం పౌడర్ రూపంలో దిగుమతి అయిన మాదకద్రవ్యాల కేసు ఏమయిందని ప్రశ్నించిన ఆయన , ఈ కేసు కూడా నీరు కారకముందే ప్రతిపక్షాలన్నీ దృష్టి సారించాలని కోరారు. ఏక వ్యక్తి ప్రతిపక్షంగా నేను కూడా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

మాదకద్రవ్యాల మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే…

మాదకద్రవ్యాల మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యాన్ని భయపెట్టి మీ పేరిట సరుకు దిగుమతి చేసుకుంటామని చెప్పి ఉంటారన్నారు. అయితే దిగుమతి చేసుకున్న సరుకు ఏమిటో వారికి తెలిసి ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. ఇప్పుడు మాదకద్రవ్యాల దిగుమతి గురించి తెదేపా నాయకులు ప్రశ్నిస్తే… వాళ్లంతా మీ చుట్టాలు, మీ బంధువులేనని ఎదురు దాడి చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

గతంలో ఓటుకు నోటు అని, ఇప్పుడు ఓటుకు డ్రగ్స్ పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న వైకాపా నేతల ఆరోపణలు చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. విశాఖపట్నంలో దిగుమతి అయిన 25 టన్నుల మాదకద్రవ్యాలను చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి తెదేపా నేతలు ఇంటింటికి పంచుతారట… ఇది వైకాపా నేతల ఆరోపణ అర్థమయిందా?, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. డ్రగ్స్ ఎవరి చేతిలో ఉన్న నేరమేనని, అది నీలాంటి నేరస్తుడే మాత్రమే చేయగలరంటూ జగన్మోహన్ రెడ్డి పై రఘు రామ కృష్ణంరాజు ఒంటి కాలి తో లేచారు.

టిడిపి నేతలు డ్రగ్స్ పంచకుండా చూడాలని లేఖలు రాశారంటే, సిబిఐ అధికారులు రేపు తమను ప్రశ్నించడం ఖాయమని ముందే తెలుసుకొని ఇటువంటి ఎత్తుగడ వేశారన్నారు. టిడిపి, బిజెపి కూటమి అయిన తరువాత కుట్ర చేసి మమ్మల్ని అరెస్టు చేశారని చెప్పుకోవడానికి ముందస్తు ఎత్తుగడే ఇది అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పంచడం కోసం తెదేపా నేతలు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సాక్షి రాతలు పరమ రోతగా ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వెధవ వేషాల గురించి పచ్చి నిజాలు చెబుతున్న వ్యక్తిగా, ఈ ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.

దామరచర్ల, రాయపాటి, లావు కృష్ణదేవరాయల కుటుంబం కూనం వీరభద్రరావు కుటుంబంతో సన్నిహితంగా ఉందని సాక్షి చెత్త రాతలు చూసిన తర్వాత రచ్చబండ కార్యక్రమం కచ్చితంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. మాదకద్రవ్యాల వ్యవహారంలో మాపై బురద చల్లుతున్నారని, మాపై బురద చల్లకుండా చూసుకోవలసిన బాధ్యత ఎన్నికల సంఘాని దేనిని మాజీమంత్రి పేర్ని నాని పేర్కొనడమే కాకుండా, లేఖ కూడా రాశామని చెప్పారు.

నిన్న ఉదయం నుండే సాక్షి దినపత్రిక ఇతరులపై బురద చల్లడం ప్రారంభించింది. కూనం వీరభద్రరావు వ్యాపార భాగస్వామి, పురందరేశ్వరికి వియ్యంకుడని తప్పుడు రాతలను రాసిందన్నారు. అతనేమి వీరభద్ర రావు కు వ్యాపార భాగస్వామి కాదు. గతంలో కలిసి వ్యాపారం చేసిన మాట నిజమే. ఇప్పుడు ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారన్నారు.
నిన్న మొన్నటి వరకు నీ పార్టీలోనే ఉన్న కృష్ణదేవరాయలపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.

విదేశాలకు వెళ్లినప్పుడు కోటయ్య చౌదరితో కలిస్తే కలిసి ఉండవచ్చు. పదేళ్ల క్రితం కోటయ్య చౌదరితో కలిసి దిగిన ఫోటోను ప్రచురించి సంబంధాలను అంటగడతారా? అని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. సాక్షి దినపత్రిక యాజమాన్యం నీచ నికృష్ట దరిద్రంగా తయారయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE