యువర్ ఆనర్..
అచ్చమైన అనువాదం
కాదు కాని..
అయ్యా..
గౌరవ న్యాయమూర్తీ…
ఎంతటి స్ఫూర్తి..
ఇంకెంతటి ఘనకీర్తి..
దేశ అత్యున్నత
న్యాయపీఠంపై
తెలుగు జాతికి పెద్ద పీట..
సర్వోన్నత న్యాయస్థానంలో
తెలుగు వాడి తీర్పుల వాడి..!
మన రమణ…
ఓ సంస్కరణ..
ఓ విశ్లేషణ..
ఓ జాగరణ..
ఓ ప్రేరణ…
కన్నుల గంతతో..
కలతపడిన వ్యవస్థతో..
ఎటూ చెప్పలేని దురవస్థతో
నలుగుతున్న..
ఖ్యాతి కరుగుతున్న
న్యాయదేవతకు
సరైన అండ
మా తెలుగు తల్లికి మల్లెపూదండ..!
గౌరవ న్యాయమూర్తీ..
మీ గురించి చాలా విన్నాం..
కొన్ని కన్నాం..
మీకు పదవీకాలం గౌరవం..
తెలుగు జాతికి గర్వం..
ఇక మీ నేతృత్వంలో
న్యాయ రంగంలో
మొదలు కావాలి
సరికొత్త పర్వం..
ఆగిపోరాదు మీ యాత్ర..
న్యాయవ్యవస్థకు
అది కావాలి జవజీవం
పెంచే మాత్ర..!
డిలేడ్ జస్టిస్ ఈజ్
డినైడ్ జస్టిస్..
ఈ నిందే న్యాయవ్యవస్థను
ముంచింది నిండా…!?
ఆ జాప్యాన్ని నివారిస్తే..
కొన్ని అసాధ్యాలు సుసాధ్యమైతే..
సాధించి మీరు
అనితర సాధ్యులైతే…
న్యాయం పారాహుషార్..
మా రమణ వంటి న్యాయకోవిదుడు
నెవర్ బిఫోర్
ఎవర్ ఆఫ్టర్ అనుకుంటే..
దేశం చెబుతుంది
మీకు జోహార్..
తెలుగు జాతి మిమ్మల్ని
చూసి గర్వంతో
ఎగరేయదా కాలర్..!!
( అతున్నత న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పదవీ విరమణ చేసిన సందర్భంగా.. ఆయన జన్మ దినోత్సవ అభినందనలతో..)
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286