-తొలి భారత పిన్న వయస్కురాలిగా రికార్డ్
-ప్రపంచంలోనే ద్వితీయస్థానంలో కామ్యా
ముంబయి: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డు నెలకొల్పింది. మౌంట్ ఎవరెస్ట్‌ను నేపాల్ వైపు నుంచి అధిరోహించిన తొలి భారత పిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతిగాంచింది. భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎస్.కార్తికేయన్‌తో కలసి కామ్యా ఈ నెల 20న 8849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్‌ను అధిరోహించింది. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్ట ర్న్ నేవల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేసింది.