Suryaa.co.in

Andhra Pradesh

వేద పరిషత్ పక్కన “హలీమ్ సెంటర్” మూసివేత

-ఫలించిన బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాటం
-శిరిపురపు శ్రీధర్‌కు అభినందనలు

అమరావతి: గుంటూరు బ్రాడీపేట 4/12 లో గల వేద విద్య పరిషత్ ప్రక్కనే ముస్లిం హలీం సెంటర్ ను పోయిన మంగళవారం ప్రారంభించారు. దీనిపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ హలీం సెంటర్ చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు, మార్వాడీలు స్థానికులతో కలసి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.ఇది కూడా చదవండి: వేద పరిషత్ పక్కనే ‘ముస్లిం హలీం సెంటర్’

దీనిపై సోషల్ మీడియాలో కూడా వైరల్ జరిగింది. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్ మేయర్ మరియు స్థానిక శాసనసభ్యునికి స్థానికులు వ్రాత పూర్వక ఫిర్యాదు అందచేయడం జరిగింది.

దీనిపై స్పందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు తక్షణమే అనుమతులు లేని ఈ హలీం సెంటర్ కు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం జరిగింది వేద సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా, శాంతిభద్రతల సమస్య రాకుండా చొరవ చూపినందుకు మున్సిపల్ అధికారులకు ప్రజాప్రతినిధులకు,హిందుత్వ వాదులకు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు.
gnt-notice

LEAVE A RESPONSE