విజయవాడ, మహానాడు: విజయవాడను ముంచి, శోకసంద్రంలోకి నెట్టేసిన బుడమేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హెలికాప్టర్ సాయంతో పరిశీలించారు. ఆ వివరాలు..
• బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన.
• బుడమేరు ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన.
• బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం.
• బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనుల పరిశీలించిన చంద్రబాబు
• కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించిన సీఎం
• ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను పరిశీలించిన చంద్రబాబు.
• కృష్ణా నది సముంద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను పరిశీలించిన సీఎం.