విజయవాడ : సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో దాతల నుండి స్పందన పెద్ద ఎత్తున లభిస్తోంది.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నేతలు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను చెక్కు, నగదు రూపంలో అందించారు. విరాళాలు అందించిన వారిలో….
1. కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు
2. జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ.5 కోట్లు
3. శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ.2 కోట్లు
4. విట్ ఛాన్సలర్ డా.విశ్వనాథమ్ రూ.1 కోటి 57 లక్షల 50 వేలు
5. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.1 కోటి
6. రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు(సుజలాన్ & యాక్సిస్ ఎనర్జీ) రూ.1 కోటి
7. సీఎం రాజేష్, సీఎం రిత్విక్ రూ.1 కోటి.
8. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు రూ.50 లక్షల
9. విజయవాడ క్లబ్ తరపున సెక్రటరీ పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ.50 లక్షలు
10. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు
11. కోటం సంధ్య రూ.5 లక్షలు
12. సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ.5 లక్షలు
13. వై.చలపతి రావు రూ.1 లక్ష
14. పరుచూరి శ్రీనివాసరావు రూ.1 లక్ష
15. సీహెచ్ దీపిక రూ.1 లక్ష
16. ఏ.శోభారాణి రూ.50(నగదు)
17. స్వాతంత్య్ర సమరయోధులు-సర్వోదయ ట్రస్ట్ తరపున డా.మోహన్ కృష్ణ రూ.1.50 లక్షలు
18. బొప్ప అనురాధ రూ.1 లక్ష
19. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఒక రోజు మూల వేతనం.
20. బి.అనురాధ రూ.1 లక్ష
21. పరుచూరి అజయ్ కుమార్ రూ.10 వేలు
22. సంధ్యారాణి రూ.10 వేలు….విరాళంగా అందించారు.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నందుకు దాతలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.