రాష్ట్రంలో ఉండే జనాభా సెన్సెస్ ప్రకారం ఐదు కోట్లు అంట. ఆ ప్రకారం ఇంటికి నలుగురు మనుషులు అనుకుంటే, కోటి 25 లక్షల గృహాలు ఉం టాయని అర్థం అవుతుంది . మీ ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డుదారులు, ఈ రాష్ట్రంలో ఒక కోటి 47 లక్షలు ఉన్నాయని మీరే ఈ మధ్య ప్రకటించారు .ఆ లెక్క ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. సెన్సెస్ తప్పా? తెల్ల రేషన్ కార్డులు లెక్క తప్పా? తేల్చవలసిన బాధ్యత మీదే.
మీరు 87% మందికి మీ పథకాలు ,మీ నవరత్నాలు ఇస్తున్నామని చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇన్కమ్ టాక్స్ పేయర్స్ 22 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రస్తుత ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు కలిపి 15 లక్షలు ఉంటారని ఒక అంచనా రాజకీయ నాయకులు ,ఆర్థికంగా బలంగా ఉండే ఇతర వర్గాలు, ప్రైవేట్ డాక్టర్లు , ఇంజనీర్లు ,ఇతర వ్యాపారాలు చేసేవారు తదితరులు 10 లక్షల వరకు ఉంటారు. వీరెవరు తెల్ల రేషన్ కార్డుకు కానీ ,మీరు ఇచ్చే పథకాలకు కానీ అర్హులు కారు, అనర్హులు .
ఇవన్నీ కుటుంబాల లెక్క వేస్తే 47 లక్షల కుటుంబాలు వచ్చాయి. కోటి 25 లక్షల కుటుంబాలలో 47 లక్షల కుటుంబాలు తీసివేస్తే, 78 లక్షల కుటుంబాలు వచ్చాయి మీరు చెప్పిన పర్సంటేజ్ ప్రకారం చూస్తే .. 62.4% వస్తుంది మీరేమో మీ పథకాలు 87% కు చేరుతున్నాయి అని మాట్లాడుతున్నారు . ఖచ్చితంగా దీనిని బట్టి మీ లెక్క తప్పు ఉంది అని స్పష్టంగా అర్థం అవుతుంది . ఈ లెక్కలు ఎక్కడ తప్పులు ఉన్నాయో ప్రభుత్వంలో ఉండే మీరే కనుక్కోవాల్సిన బాధ్యత సరి చేయవలసిన బాధ్యత మీదే. ఎందుకంటే ఏ పథకం కూడా, అర్హుడు కాని వాడికి అందకూడదు. అందువలన నిజమైన పేదరికంలో ఉండే అర్హులైన పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. దీనిని బట్టి మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఎవరికి పడితే వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా తేటతెల్లమవుతుంది .
రాష్ట్ర ప్రజలు ఎన్నో అవస్థలు పడి , అష్ట కష్టాలు పడి కట్టే పన్నుల తో, మీరు ఇస్తున్న పథకాలు రాష్ట్ర ప్రజల సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా.. దానిని తుంగలో తొక్కి తిరిగి మీరు ఎన్నికల్లో గెలవడం కోసం, మనిషి వ్యక్తిగత బలహీనతలను ఆసరా చేసుకుని, నాకు వస్తే ఓటు చాల్లే( అర్హత లేకపోయినా) రాష్ట్రం ఏమైపోతే నాకేమిటి? అనే భావన ప్రజల్లో కలిగించేటట్టుగా, మీరు చేస్తున్నారంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటు పోతుందో , ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి .
మీ పరిస్థితి పులి మీద స్వారీ చేస్తున్నట్టు అన్పిస్తుంది. పులి మీద నుంచి కిందకు దిగితే (పథకాలు అందరికీ ఇవ్వకపోతే ) పులి తినేస్తుంది. దిగకపోతే ప్రజలు తినేస్తున్నారు.( టాక్స్లు కట్టేవారు బలైపోతూ, రాష్ట్రం అభివృద్ధి దిశలో నడవక వెనుకబడిపోతుంది అనుకునేవారు మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు) 20 వ తేదీ మంగళవారం మీరు తీసుకున్న 2000 కోట్ల రూపాయల అప్పు, అధిక వడ్డీకి 8.2% కు తీసుకున్నట్టుగా తేట తెల్లమవుతుంది. అంటే మీ ఆర్థిక అవసరం ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం అవుతుంది.
ప్రజలు వారి అవసరాలకు వడ్డీలకు డబ్బు తెచ్చుకుంటుంటారు. ఈ లెక్కలన్నీ అందరికీ తెలుసు. అప్పు దొరకనివాడు మూడు రూపాయలకు, ఐదు రూపాయలకు, పది రూపాయలకు కూడా వడ్డీకి తెచ్చుకొని ఆ రోజుకి ఆరోజు కాలం గడుపుతుంటారు. మీరు చేసే పద్ధతి కూడా దానికి భిన్నంగా ఏమీ లేదనిపిస్తుంది . రాష్ట్రాన్ని సజావుగా నడిపే నాయకుడు లక్షణం ఇదేవిధంగా ఉంటుందా? ఇది న్యాయమా ? ఇది ధర్మమా ? మీ సొంత వ్యాపారం అయితే మీరు ఇదే విధంగా చేస్తారా !