బిజెపికి గిరిజనుల పట్ల ప్రేమ.. వాత్సల్యం ఎంతంటే…

గిరిజనులు దేశం మొత్తం మీద తొమ్మిది శాతం వరకు ఉన్నారు. ఎక్కువగా మైదాన ప్రాంతాల కంటే, అడవి ప్రాంతంలోనే వారి నివాసం ఎక్కువ వారి గురించి స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి పెద్దగా వారి మీద, వారి పట్ల, వారి పెరుగుదల కోసం ప్రయత్నాలు పెద్దగా జరగలేదని చెప్పాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకునే తప్ప, వారి అభివృద్ధికి మనసుపెట్టి పని చేసింది తక్కువ. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను పోకుండా కాపాడుతున్న జాతి అది.

వన వాసి కల్యాణ ఆశ్రమం పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, వారికోసం అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ వాజ్ పాయి 1999 లో అధికారంలోకి వచ్చాక, మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో గిరిజన మంత్రిత్వ శాఖను కేటాయించి, 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ నెలకొల్పారు. వాజ్ పాయ్ హయాంలో ప్రారంభించినvajpai-adwani గిరిజన సంక్షేమాన్ని, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మరింత ప్రభావంతంగా సబ్కా సాత్,సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ , సబ్ కా ప్రయాస్ అన్న నినాదంతో గిరిజనుల ఆశలు, అవసరాలు , ఆకాంక్షలతో ముందుకు తీసుకెళ్తున్నారు.

ఆదివాసీల సంక్షేమం పురోగతితో ముడిపడిన కార్యక్రమాలను, గత ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిధులను భారీగా పెంచింది. 2020-21 బడ్జెట్లో ఎస్టీ ప్రణాళిక నిధులను, గతంలో కంటే నాలుగు రెట్లు, 21 వేల కోట్ల నుండి 86 వేల కోట్లకు పెంచారు. జలజీవన్ మిషన్ కింద 1.28 కోట్ల గిరిజనులకు ప్రస్తుతం కుళాయిల ద్వారా నీరు అందుతుంది . ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 38 లక్షల ఇల్లు 1 .45 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశారు . ఆయుష్మాన్ భారత్ పథకం కింద 82 లక్షల ఆరోగ్య కార్డులు పంపిణీ జరిగింది .

గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఏకలవ్య ఆదర్శ పాఠశాలల బడ్జెట్, 278 కోట్ల నుంచి 1,148 కోట్లకు పెరిగింది .గిరిజన విద్యార్థుల ఉపకార వేత్తనాల కోసం కేటాయించే నిధులు.. 978 కోట్ల నుంచి 2,546 కోట్లకు చేరాయి .పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 327 కోట్లతో 3,110 వన్ ధన్ వికాస్ కేంద్రాలు,53 వేల వన్ ధన్ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. . గనుల తవ్వకాల ద్వారా ముఖ్యంగా నష్టపోయేది గిరిజనలే. వారికి ఆ గనులతో వచ్చిన ఆదాయంలో 30% స్థానిక గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెడుతుంది . ఇప్పటిదాకా దాని కింద జమ అయిన 57 వేల కోట్లను పలు అభివృద్ధి కార్యక్రమాలను వినియోగిస్తుంది. గిరిజనులు రూపొందించే ఉత్పత్తుల విక్రయ మార్కెటింగ్ బాధ్యతలను చూసుకోవడానికి, ట్రై ఫెడ్ ఆధ్వర్యంలో నడిచే ట్రబెస్ (TRIBES) ఇండియా అవుట్ లైట్స్ ను 29 నుండి 116 పెరిగాయి.

ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి” యాక్ట్ ఈస్ట్ “పాలసీని రూపొందించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా తీవ్రవాదం వైపు మరలకుండా, విజయవంతంగా జాతీయ స్రవంతిలో అనుసంధానం అవుతున్నారు. .దేశ అభివృద్ధి పురోగతిలో భాగస్వామ్యంగా నిలుస్తున్నారు.

దశాబ్దాల తరబడి పేదరికం, సామాజిక అభద్రతతో ఆదివాసీలకు తీవ్రవాదం ఆటంకంగా నిలిచింది .ఈ భయం, అనిశ్చితి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన యువతను తీవ్రవాదం వైపు మళ్ళించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రవాదం చివరి దశకు చేరింది అది మోడీ చలవే. వారిని జాతీయ స్రవంతిలో అత్యుత్తమ పదవులు ఇస్తున్నది బిజెపి ప్రభుత్వమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ శాఖకు చెందినవారే అని మనందరికీ తెలుసు. గర్విద్దాం. ఇప్పటికీ కూడా గిరిజనులు అనుకున్నంత అభివృద్ధి సాధించక, ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ రోజున ఈ దేశంలో అత్యంత నిరుపేదలు ఎవరంటే, అది గిరిజనులు.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

Leave a Reply