Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక హోదాపై.. కేంద్రంతో సీఎం కనీసం చర్చించడం లేదు

– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కింజరాపు రామ్మోహన్నాయుడు

ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు కేంద్రంతో కనీసం కూడా చర్చించడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, లోకసభ సభ్యులు, కింజరాపు రామ్మోహన్నాయుడు ఆరోపించారు.వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. రాజధానిపై కట్టుకథలు చెబుతుందని ధ్వజమెత్తారు.

విశాఖ రాజధాని పేరుతో వైకాపా నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా నాయకులు పక్కన పెట్టి.. రాజధాని అంశంపై కట్టుకథలు చెబుతున్నారన్నారు.

తెదేపా ప్రభుత్వం హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం గడిచిన ఈ మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు కేంద్రంతో కనీసం చర్చ కూడా చేయడం లేదన్నారు.

LEAVE A RESPONSE