Suryaa.co.in

Andhra Pradesh

పులివెందులలో సీఎం జగన్‌ క్రిస్మస్‌ ప్రార్థనలు

పులివెందుల: క్రిస్మస్‌ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ స్వస్థలమైన కడప జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో సీఎం జగన్‌, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

LEAVE A RESPONSE