Suryaa.co.in

Andhra Pradesh

ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, మరో 13,573 వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు. అంతకుముందు రైతు నాయకులతో కలిసి జగన్ ట్రాక్టర్ ఎక్కారు. కొద్దిదూరం స్వయంగా డ్రైవ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అక్టోబర్ లో మరో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా వ్యవసాయ యంత్రాలను అందిస్తామని ప్రకటించారు.

LEAVE A RESPONSE