హోటల్‌లో ఫుడ్‌ యమా డేంజర్‌ గురూ..

మీరు రెస్టారెంటులో అది ఎంత పెద్దదైనా ఎంత పేరొందినదైనా సరే మీరు నాన్‌వెజ్ ఆర్డర్ ఇవ్వగానే ఎంత రద్దీగా వున్నా, ఎన్ని వెరైటీలు ఆర్డరిచ్చినా, అవి మీ టేబుల్ మీదకు 10-15 నిముషాల్లో ఎలా వస్తుందో ఎన్నడైనా ఆలోచించారా? ఎందుకు అవి అంతగా వూరిస్తూ రుచిగా వుంటాయో ఆలోచించారా?

ప్రభుత్వ అధికారులు హోటళ్లమీద దాడిచేయగానే, కిరాణ వస్తువుల ఉత్పత్తి ఫ్యాక్టరీలమీద దాడిచేయగానే చాలమంది నివ్వెరపోతారు. కేజీలకొద్దీ మాంసం, కొంత కుళ్ళిపోయి, పురుగులు పట్టి కెమెరాలకు చిక్కడం. చెక్కపొడి, చింతపిక్కల పొడి కలిపిన కారం, మాసాలాలు, జంతువుల కళేబరాలనుండి తీసిన వంటనూనెలు అంటూ..

హోటల్లో మీరు ఆర్డరేయగానే వెంటనే పొట్టేలునుగానీ, కోడిని కానీ కోయరు. చికెన్, మటన్, బీఫ్ అంతకుముందే తెచ్చి ఉడకబెడతారు ఉప్పు వేసి. తర్వాత డీప్ ఫ్రీజర్లో పెడతారు. మీరు ఆర్డర్ చేయగానే అందులోంచి తీసి మసాలా వేసి వేడిచేసి సర్వ్ చేస్తారు. కనీసం మూడు రోజులకైనా సరిపడ నిల్వలైనా వుండాలి, ఎప్పుడెంతమంది కష్టమర్లు వస్తారో తెలియదు కాబట్టి. పైగా రోజూ చికెన్ సెంటర్ల చుట్టూ, మసాలా, బియ్యం, కూరగాయలు అంటూ తిరుగుతూ వుండరు. ఒకేసారి తెచ్చి పెట్టుకుంటారు.

మీరు చెప్పగానే పొట్టేలునుగానీ, కోడిని కానీ కోయరు. చికెన్, మటన్, బీఫ్ అంతకుముందే తెచ్చి ఉడకబెడతారు ఉప్పు వేసి. తర్వాత డీప్ ఫ్రీజర్లో పెడతారు. మీరు ఆర్డర్ చేయగానే అందులోంచి తీసి మసాలా వేసి వేడిచేసి సర్వ్ చేస్తారు.

వృత్తిరీత్యా ఎన్నో రెస్టారెంట్లను ఇన్‌స్పెక్షన్ చేసిన అనుభవంతో కావచ్చు, వ్యక్తిగతంగా ఎంతోమంది హోటలియర్లను పరిచయస్తులుగా కలిగిన అనుభవంతో నేను చెప్పింది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించండి!

పనికిరాని పదార్థాలు, నిల్వపదార్థాలు మాత్రమే కాదు, అంతకన్న ముఖ్యంగా హానికరపదార్థాల వాడకం గురించి అర్థం చేసుకోవాలి. ఫుడ్ కలర్స్ వాడకం, రుచికోసం టేస్టింగ్ సాల్ట్ అనే రెండు కీలక పదార్థాల వినియోగం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.

ఒక్కోసారి సగటున ఒకపట్టణంలో వినియోగించే మైదా, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ తెలిస్తే మీరు ఇంకెప్పుడూ బయట తినరు. అసలు ఫుడ్ కలర్స్ ఎలా చేస్తారో, ఫుడ్ ఎస్సెన్స్ ఎలా చేస్తారో మీకు తెలియదు. కారం, మసాలాలు ఎన్నిరకాలుగా తయారుచేస్తారో మీకు తెలియదు. చాలా విషయాలు మీకు చెప్పలేనుకూడా. బాగా క్లోజ్ అయినవాళ్ల రెస్టారెంటుకు వెళ్లినా నన్ను కిచెన్‌లోకి రానివ్వరు, అంతా తెలుసుకదా, తినడం మానేస్తారు, లోపలికి రావద్దు అంటారు.

అందుబాటులో డ్రైవరున్నా, ఎన్నో రెస్టారెంట్ల ఆఫర్లున్నా దాదాపు బయట నుండి ఏ ఫుడ్డూ ఎందుకు మా ఇంట్లో తినరో మీరూహించుకోవచ్చు! తిండి ఒక పూట లేకపోతే మీరు చచ్చిపోరు. చచ్చిపోతామనుకుంటే పిడికెడు ఉప్మారవ్వ ఉడికేసుకోండి. దయచేసి బయటినుండి ఫుడ్ తెప్పించుకోవడం మాత్రం మానండి.

– సిద్ధార్తి సుభాష్‌ చంద్రబోస్‌