Suryaa.co.in

Andhra Pradesh

ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సీఎం జగన్ ఫైర్ ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి రావడంతో పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారుల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు పది హేను రోజుల ముందే ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినట్లు సమాచారం.

పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని మరీ విజయవాడకు భారీ సంఖ్యలో ఉద్యోగులు చేరుకున్నారు. అయితే వారిపై ఎలాంటి లాఠీ ఛార్జి వంటివి చేయవద్దని జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలో వారు భాగమేనని శాంతియుత పద్ధతిలో కార్యక్రమం ముగిసేలా చూడాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది.

LEAVE A RESPONSE