తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయిని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…
అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు….