నెల్లూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయిని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు