– ఆక్వాధరల పతనం, ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన రైతులు, రైతు సంఘాలు నేతలు
– ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం సీరియస్
– ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు
– వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు
– ధరలు పతనమై నష్టపోతున్నామన్న రైతులు
– అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు
– తన దష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి
– రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
– రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం
– ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు
– వారం రోజుల్లో నివేదిక అందించాలన్న సీఎం
– నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
– కమిటీలో మంత్రులు విద్యుత్ , అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ& డెయిరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీఎస్ సమీర్ శర్మ, స్పెషల్ సీఎస్‌లు విజయానంద్, పూనం మాలకొండయ్య, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబులు
– ఆక్వా రైతుల ఫిర్యాదులపై తగిన చర్యలకు నిర్ణయం
– ఆక్వా రైతులను ఆదుకునేదిశగా తక్షణ ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైయస్.జగన్
ఆక్వా కల్చర్‌లో 60 శాతం నిర్వహణ వ్యయం కేవలం ఫీడ్ కోసం వెచ్చించాల్సిన పరిస్థిది.
ప్రస్తుతం ఈ ఫీడ్‌కు సంబంధించిన నాణ్యత ఇతర అంశాల పర్యవేక్షణ కోసం ఎలాంటి నియంత్రణ వ్యవస్ధ రాష్ట్రంతో పాటు దేశంలోనూ మరెక్కడా లేదు.
ఈ నేపధ్యంలో ఫిష్ ఫీడ్‌కు సంబంధించి… అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్యపరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది.
ఆంద్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ – 2020 ని తీసుకుని రావడం ద్వారా..ఆక్వా రైతులకుఅండగా నిలబడింది.
దీంతో పాటు ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా ఆక్వాకల్చర్ రంగలో నాణ్యమైన సీడ్ అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అడుగులు పడ్డాయి.
మరోవైపు కల్తీ సీడ్‌ని నియంత్రించడం ద్వారా వ్యాధుల బారిన పడని, పెరుగుదల లేని రకాలను నియంత్రణతో పాటు మంచి దిగుబడినిచ్చే సీడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలిగింది.
ఇది ఆక్వా కల్చర్ రంగానికి వెన్నుముక అయిన రైతుకు అండగా నిలబడింది.
ఈ యాక్ట్ ద్వారా ఆక్వారంగంలో అనైతిక విధానాలకు అడ్డుకట్టు వేయడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు అవకాశం కలిగింది.
మత్స్యపరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దానికై అత్యధిక ప్రాధాన్యతనిస్తూ… ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ 39(2020) ద్వారా… ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుంది.
మరోవైపు రాష్ట్రంలోని ఆక్వాకల్చర్‌కు సంబంధించిన కార్యకలాపాలును ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు… ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ ఆధారిటీ(ఏపీఎస్‌ఏడీఏ) యాక్ట్– 2020 ద్వారా.. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆయన ఛైర్మన్‌గా గా వ్యవహరించే…. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ ఆధారిటీని ఏర్పాటు చేసింది.
ఈ సంస్ధ ఆక్వాకల్చర్ ఉత్పత్తుల నాణ్యత, ధరలతో పాటు సీడ్, ఫీడ్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది.
కోవిడ్ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది.
రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల నుంచి నిషేధం కారణంగా… ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది.
అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతలగిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులను తగిన ధరలను కూడా నిర్ణయించింది.
ఆక్వారైతుల సంక్షేమ కోసం…
ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు… వారి ఉత్పాదయ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు సరఫరా చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ కూడా ఇచ్చింది.
గతంలో 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 పైసలకు సరఫరా చేసింది.
జూన్ 2108 నుంచి జూన్ 2019 వరకు రూ.2 కే యూనిట్ సరఫరా చేయగా… జూలైలో ప్రభుత్వం దాన్ని రూ.2 యూనిట్ కాస్ట్ నుంచి రూ.1.50 కే అందిస్తూ ఉత్తర్వులుజారీ చేసింది.
రాష్ట్రంలో సాగు వివరాలు:
ఆక్వాకల్చర్ సాగులో దేశంలోనే అగ్రస్ధానంలో ఆంధ్రప్రదేశ్.
సుమారు 2 లక్షల హెక్టార్ల ఆక్వాసాగులో 1.10 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు
429 రొయ్యల హేచరీస్, 102 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 107 శీతలగిడ్డంగులు, 37 ఫీడ్ ప్లాంట్లు, 225 ఆక్వా ల్యాబులు, 1014 ఆక్వా షాపులతో ఏపీలో ఏడాదికి సుమారు 60వేల మిలియన్‌ల ఉత్పత్తి.
ఫలితంగా ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా నిల్చిన ఏపీ.
దేశంలోనే 30 శాతానికి పైగా వాటాతో రొయ్యలు, చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా నిల్చిన ఏపీ.
ఆక్వా కల్చర్ ద్వారా రాష్ట్రంలో సుమారు 16.50 లక్షల మందికి ఉపాధి.
దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న రొయ్యలలో 78 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా.. దేశవ్యాప్తంగా 10.17 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా… కేవలం ఏపీలోనే 7.89 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిషాతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రతిఏటా దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్.
ఆక్వా కల్చర్ అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు…:
ఆక్వారంగాన్ని ప్రోత్సహించేందుకు, ఆక్వా రైతులను ఆదుకునేందుకు గ్రామస్ధాయిలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు.
ఆక్వా రైతులకు రాయితీతో కూడిన ఫీడ్ వంటి ఇన్‌పుట్స్ అందించడంతో పాటు, ఆక్వాసాగులో అత్యాధునిక, వినూత్న విధానాల్లో శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం.
దీనికోసం ఆర్బీకే స్ధాయిలో దాదాపు 732 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం.
ఇ-క్రాపింగ్:
ఆక్వారైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధర కల్పించేందుకు ఇ–క్రాప్ (ఇ–ఫిష్) బుకింగ్ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం.
ఇ–ఫిష్ యాప్ సహకారంతో సుమారు 4.02 లక్షల హెక్టార్ల మత్స్య, రొయ్యల సాగు విస్తీర్ణాన్ని నమోదు చేసిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు.
వైయస్సార్ మత్స్య సాగుబడి…
ఇ–మత్స్యకార పోర్టల్ సహాయంలో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ఏర్పాటు. వీటి సహాయంతో ఆక్వా రైతులకు సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాల వినియోగంపైనా శిక్షణ.
ఆర్బీకేల ద్వారా తక్కువ ధరకే ఆక్వా ఫీడ్ సరఫరా… రూ.13.27 కోట్ల విలువైన 2473 మెట్రిక్ టన్నుల ఫీడ్ ఆక్వా రైతులకు సరఫరా చేసిన ప్రభుత్వం.
కిసాన్ క్రెడిట్ కార్డ్స్…
ప్రైవేటు రుణదాతలమీద అధికవడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా… ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు బ్యాంకుల ద్వారా రుణాలిప్పించే కార్యక్రమాన్ని చేపట్టిన మత్స్యశాఖ.
వీరి వివరాలను జిల్లాల వారీగా, సెక్టార్‌వారీగా, బ్యాంకుల వారీగా ఇ మత్స్యకార పోర్టల్‌లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.
ఇప్పటివరకు 19059 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ చేయడం ద్వారా.. రూ.2673 కోట్లు రుణాలు మంజూరు.
ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు…
వ్యవసాయ, మత్స్యరంగాల్లో రైతులు సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు.
155251 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
63 మంది సాంకేతిక సిబ్బంది సహకారంతో వ్యవసాయ, మత్స్య రంగాల్లో వివిధ రకాల సలహాలు అందించనున్న కాల్ సెంటర్.
ఐసీఏఆర్, సీఐఎఫ్‌ఏ, కేవికేస్ సహకారంతో సేవలందించనున్న కాల్‌సెంటర్.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనువుగా రైతుల కోసం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు. మత్స్యశాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అధారిటీ యాక్ట్ ప్రకారం ప్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఫార్మ్స్‌కు అనుమతి మంజూరు.
ఎగుమతి చేసే జాతులకు సంబంధించి ఫార్మ్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ మంజూరు చేయనున్న ఎంపెడా.
రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(ఎస్‌ఐఎఫ్‌టీ) ద్వారా ఆక్వా రైతులకు నిరంతరం సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులు, ఇతర భాగస్వామ్యుల సహకారంతో పర్యావరణ హిత ఆక్వాకల్చర్ సాగుకు శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం.
మౌలిక సదుపాయాలకు పెద్ద పీట…
27 ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబులు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న మరో 8 ల్యాబులను ఆధునీకరించడం ద్వారా మొత్తం అన్ని కోస్తా జిల్లాల్లో మొత్తం∙35 ప్రాంతాల్లో ఆక్వాల్యాబులు ఏర్పాటు.
నీరు, మట్టి విశ్లేషణ చేయడంతోపాటు వివిధ రకాల పరీక్షల కోసం రూ. 50 కోట్లు ఖర్చుతో ల్యాబులు.
మొత్తం 35 ల్యాబులకు గానీ, 14 ఆక్వా ల్యాబులు కాగా, 3 మొబైల్ ఆక్వా ల్యాబులు, మరో 21 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబులు. 2022 ఆఖరునాటికి అందుబాటులోకి రానున్న ఆక్వా ల్యాబులు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట గ్రామంలో ఎల్.వెన్నామెయి కల్చర్ కోసం ఎంపెడా–ఆర్‌జీసీఏ సహకారంతో రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ(ఏక్యూఎఫ్) ఏర్పాటుకు నిర్ణయం.