22న సీఎం జగన్ కుప్పం పర్యటన

68

-కుప్పంలో సీఎం పర్యటన ఖరారు
-కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులకు -శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
-హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించిన పార్టీ నేతలు

అమరావతి, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పం వెళ్ళనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రానుండడంతో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు.
కాగా విపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే.