Suryaa.co.in

Andhra Pradesh

వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం జగన్‌ సమీక్ష

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

– ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలి
– సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలి
– ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలి
– అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలన్న సీఎం.

వైయస్సార్‌ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను సీఎంకు అందించిన అధికారులు.
– 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవకింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి.
– 1615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ.
– రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు అందించిన ప్రభుత్వం. ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అందించిన ప్రభుత్వం.

– మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం.
– సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ.
– వీరిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి.
– షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఎస్టీ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం.
– ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్న సీఎం.
–దీనికోసం రూ.910 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.

– ఆర్బీకేల పరిధిలో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అధికారులకు సీఎం ఆదేశం
– వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలన్న సీఎం.
– అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశం.

– చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలన్న సీఎం.
– వారికి పశువులను పంపిణీచేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలన్న సీఎం.
– దీనివల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్న సీఎం.
– అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్న సీఎం.

అమూల్‌ పాలసేకరణపైనా సీఎం సమీక్ష
– 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ.
– ఇప్పటివరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ.
– పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి.
– అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి.
– ఆయా డైరీలు ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి.
– వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరించనున్న అమూల్‌ పాలసేకరణ
– అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ.
– చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశం.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం
– ఫేజ్‌–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు.

ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష
– మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు.
– సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌరసరఫరాల శాఖ. వీటిని సీఎంకు వివరించిన అధికారులు.
– దీనికోసం విధి విధానాలు రూపొందించిన పౌరసరఫరాల సంస్థ.
– ధాన్యం సేకరణలో భాగస్వామ్యం కానున్న వాలంటీర్లు.
– వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు.
– ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశుసంవర్ధక, పాడిపరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE