పాదయాత్రపై ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?

52

-రాజధాని రైతుల పాదయాత్ర విషయంలో పోలీసులు, ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది
-ఇవాళ అనుమతిపై సాయంత్రంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఆదేశించింది
– తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది

రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. లేదంటే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

రాజధాని రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి కావాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు అనుమతిపై ఇంకా ఏ విషయం తెలపలేదని పిటిషనర్‌ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.