అమరావతి వివాదాలు..వాస్తవాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

-కందుల రమేష్ రాసిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు, మేథావులు, రైతులు
-కార్యక్రమంలో అమరావతి పాదయాత్ర ఉద్యమంపై రూపొందించిన గీతాల సిడిని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు, జెఎసి నేతలు

• అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి.
• రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వితం కాదు…మనం చేసే పనులు శాశ్వితం.
• మన చేసిన పాలన వల్ల రాజకీయ లబ్ది జరిగిందా….లేక ప్రజలకు మంచి జరిగిందా అని చూడాలి.
• నాడు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఇప్పుడే అడిగాను…ఎప్పుడైనా నాడు వైఎస్ఆర్ సైబరాబాద్ ను నిలిపివెయ్యాలి అనుకున్నారా అని…ఆయన ఎప్పుడూ వైఎస్ అలా ఆలోచన చెయ్యలేదు అన్నారు.
• శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నా హయాంలో భూములు సేకరించా….తరువాత వచ్చిన వైఎస్ ఆర్ భూమిపూజ చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు.
• నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అంతా నాడు హైదరాబాద్ లో ప్రాజెక్టులు కొనసాగించారు. అందుకే నేడు హైదరాబాద్ ఆ స్థాయికి చేరింది.
• ఇప్పుడు ప్రజలు అంతా మనం చేసిన పనులు గుర్తు చేసుకావాల్సిన అవసరం లేదు…కానీ ఒక తృప్తి అనేది ఎప్పుడూ ఉంటుంది.
• నాడు హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడ, వరంగల్ వంటి పట్టణాలు కూడా అభివృద్ది కావాలని ఆశించాను.
• ఆదాయం ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళితే….మనకు ఆదాయం ఎలా అని ఇక్కడి ప్రజలు ఆలోచించారు.
• నాకు ఉన్న అనుభవాన్ని గుర్తించి 2014లో ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.
• హైదరాబాద్, సికింద్రాబాద్ కు విస్తరణలో సైబరాబాద్ నిర్మించాం.
• బిల్ క్లింటన్ వచ్చిన రోజునే సైబరాబాద్ అనే పేరు పెట్టాం.
• హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి.
• పిపిపి పద్దతిలో నాడు హైటెక్ సిటీ కట్టాం…అక్కడినుంచి అభివృద్ది మొదలైంది.
• ఈ రోజు తెలంగాణ అభివృద్దికి హైదరాబాద్ కీలకంగా ఉంది.
• చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ల వల్ల ఆయా రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది.
• అందుకే అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకువచ్చాం.
• రైతులు ముందుకు వస్తే….వారి భాగస్వామ్యంతో రాజధాని కడదాం అని ఒక ఆలోచన చేశాం.
• ముందుగా రైతులతో పలు మార్లు చర్చించాం…ఆ రైతులలో అన్ని పార్టీల వారూ ఉన్నారు.
• అభివృద్దికి ఎన్నికలకు సబంధం లేదు…నాడు ఖైరతాబాద్ లో ఓడిపోయాం….మొన్న తాడికొండలో ఓడిపోయాం.
• మంచి ప్యాకేజ్ ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్దమే అని రైతులు అంగీకరించారు.
• ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకువచ్చాం.
• రాష్ట్రంలో రెండు చివరి ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతి
• గుంటూరు – విజయవాడ మధ్య సరైన ప్రాంతం అని గుర్తించాము.
• నేను రాయలసీమ వాడిని….కావాలి అంటే నాడు తిరుపతిలో రాజధాని పెట్టుకునేవాడిని.
• రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలి అని…సింగపూర్ వెళ్లి మాస్టర్ ప్లాన్ చేసి ఇవ్వమని అడిగాను…సహాయం చెయ్యమని కోరాను.
• నాడు సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి అంగీకరించింది.
• రైతుల భూములకు ప్యాకేజ్ కింద నివాస భూమి ఇచ్చా, కమర్షియల్ ల్యాండ్ ఇచ్చాం.
• రాజధాని ప్రాంతంలో పేదలకు పెన్షన్ లు కూడా ఇచ్చాం.
• ఈ రోజు అమరావతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. 1000 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతుల ఉక్కుసంకల్పానికి అభినందనలు
• అమరావతి ఉద్యమంలో ఆడవాళ్లను అవమానించారు. అయినా ఉద్యమం చేశారు.
• వెయ్యి రోజుల ఆందోళన ఎక్కడా జరగలేదు…..ఇది అమరావతి రైతుల ఘనత.
• అమరావతి అనే పేరుపై అన్ని వర్గాలనుంచి ఆమోదం వచ్చింది.
• అమరావతిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని నాడు వైసిపి నేతలు చెప్పారు.
• 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారు….మేము ఇంకా ఎక్కువే తీసుకున్నాం.
• విభజనతో వచ్చిన కేంద్ర సంస్థలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్టాము. అభివృద్దిని వికేంద్రీకరించాము.
• అమరావతి పరిపాలన రాజధాని, వైజాగ్ ఆర్థిక రాజధాని, తిరుపతి పరిశ్రమల హబ్ చెయ్యాలి అనుకున్నాం.
• కేంద్రం నిథులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా పోలవరం ప్రాజెక్టును మధ్యలో ఆపేశారు.
• పోలవరం పూర్తి జరిగి ఉండే సీమ, ఉత్తరాంధ్ర లకు కూడా లబ్ది జరిగేది.
• నాకు ఏమాత్రం అనుమానం లేదు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది.
• ధర్మాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు కావాలి. ఆ త్యాగాలుకూడా ఇప్పుడు రైతులు చేస్తున్నారు.
• అమరావతి సంకల్పం చాలా ఉన్నతమైనది. ఐదుకోట్ల కోసం అమరావతి తలపెట్టాం.
• పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాల ద్వారా నాడు అమరావతికి తీసుకువచ్చాం.
• నాడు ప్రధాని యమునా జలం, పార్లమెంట్ మట్టిని తెచ్చారు. పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని నాడు ప్రధాని చెప్పారు.
• ఆ సంకల్పం వృధాకాదు….అమరావతి గెలుస్తుంది.
• రాజధాని కట్టిన తరువాత అమరావతిలో 8000నుంచి 10000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది.
• నాడు కోకాపేట భూమి ఎకరా లక్ష రెండు లక్షలు ఉండేది…ఇప్పుడు 60 కోట్లు, 70 కోట్లు అయ్యింది.
• ఇప్పుడు అమరావతి ఉండి ఉంటే ఇక్కడ కూడా రెండు లక్షల కోట్ల విలువైన ఆస్థి అందుబాటులోకి వచ్చేది.
• ఇప్పటికీ ఉత్తరాంధ్రనుంచి పనుల కోసం, ఉపాథి కోసం హైదరాబాద్ వెళుతున్నారు.
• అదే అమరావతి ఉండి ఉంటే ఇక్కడే ఉపాధి దొరికేది.
• హైదరాబాద్ లో ఏ కులం ఉందని నాడు అభివృద్ది చేశాం.
• కులం కోసంకాదు….ఒక తృప్తి కోసం సైబరాబాద్ అభివృద్ది చేశాం.
• రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటి ఉద్యోగాలు చెయ్యాలని అన్నప్పుడు హేళన చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ సాకారం అయ్యాయి.
• సాధారణ కుటుంబాల నుంచి కూడా ఉన్నత ఉద్యోగాలకు వెళ్లారు.
• అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే….అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం డబుల్.
• ఏ దేశంలో అయినా ఎక్కువ ఆదాయం పొందే వారు ఇండియన్స్…వారిలో 30 శాతం మంది తెలుగు వారు.
• అమరావతికి పెద్దగా నిధుల అవసరం కూడా లేదు. ఒక్క పైసా ఖర్చు లేకుండా…..సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతిని రూపొందించాము.
• అమరావతిపై ఎన్నో అపవాదులు వేశారు..అన్నింటిని భరించాం.
• తెలుగు జాతికి అమరావతి లాంటి ఒక రాజధాని ఉండాలి.