Suryaa.co.in

Telangana

ములుగు జిల్లా ఫారెస్ట్‌ ఆఫీసర్ పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం..

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు… అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో సమీక్ష సందర్భంగా అభివృద్ధి పనులకు అడ్డు వస్తున్నారంటూ అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. ములుగు జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ) ప్రదీప్ కుమార్ శెట్టిని మందలించారు. అటవీ శాఖలో దొంగలు తయారయ్యారని, ములుగు ప్రాంతంలో ఒక్క చెట్టయినా ఉందా? అని ప్రశ్నించారు.

అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం, వంతెన కట్టనీయం.. కరెంట్ స్తంభాలు వేయనీయం.. అన్నట్టుగా అటవీ శాఖ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. శాపల్లి వంతెన నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని డీఎఫ్ఓ ను నిలదీశారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలకు రేషన్ పంపిణీ చేయలేకపోతున్నారని అన్నారు. కలెక్టర్, ప్రజలు చావాలా? అంటూ డీఎఫ్ఓను సీఎం కేసీఆర్ నిలదీశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ అటవీ శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE