రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల్ ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో చినజీయర్ స్వామి సత్కరించి, వారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్.. భగవత్ రామానుజచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంలను చినజీయర్ స్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.