Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి పనులకు సమిష్టి నిర్ణయం

– ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం

విజయవాడ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరిగింది. దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, పిల్లి మాణిక్యాలరావు, లంక దినకర్లకు రాష్ట్రస్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్ లగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి, పురోగతి పనులపై, గుండ్లకమ్మ, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు నిర్ణయించారు. సాగునీటి సంఘాలు, సహకార పరపతి సంఘాలకు ఎన్నికల విషయమై మాట్లాడారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవిరాంజనేయులు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు, దర్శి ఇన్చార్జి కొట్టిపాటి లక్ష్మి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధి బెజవాడ సురేష్ రెడ్డి, ఒంగోలు జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE