Suryaa.co.in

Andhra Pradesh

పిఠాపురంలో కమిషనర్‌, డీఈఈ ముష్టియుద్ధం!

– హఠాత్పరిణామానికి ముక్కున వేలేసుకున్న ప్రజాప్రతినిధులు

కాకినాడ, మహానాడు: పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ముష్టియుద్ధం చేశారు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ బాహాబాహికి దిగి కొట్టుకున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా పరస్పర దాడి చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డీఈఈపై ఆరోపణలు చేశారు. ప్రతిగా స్పందించిన డీఈఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకున్నారు. గత కొంతకాలంగా కమిషర్, డీఈఈల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE