బీటెక్ రవికి ప్రాణహాని

-జరగరానిది ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వందే బాధ్యత.
– తెదేపా నేత బీటెక్ రవికి సెక్యురిటీ తొలగించడంపై డీజీపీకి అచ్చెన్న లేఖ

• ఎంఎల్‌సీ పదవీ కాలం పూర్తయిందనే నెపంతో రవికి సెక్యురిటీ తొలగించడంపై అభ్యంతరం.
• బీటెక్ రవికి ప్రాణహాని ఉంది.
• 2006లో రవి మామ ఎం. రామచంద్రారెడ్డి, కజిన్ పి.రామచంద్రారెడ్డిలను అతి దారుణంగా హత్య చేశారు.
• అప్పటి నుంచి బీటెక్ రవికి నాటి ప్రభుత్వం 1+1 సెక్యురిటీ కల్పించింది.
• ఎమ్మెల్సీ పదవి చేపట్టిన నాటి నుంచి సెక్యురిటీని 2+2 కు పెంచారు.
• బీటెక్ రవికి తన రాజకీయ ప్రత్యర్ధులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహాని ఉంది.
• ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల కోసం అర్ధంలేని కారణాలతో బీటెక్ రవికి సెక్యురిటీ తొలగించింది.
• 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోను బీటెక్ రవి వాహన శ్రేణిపై దాడి జరిగింది.
• ఆ దాడి నుంచి రవి త్రుటిలో తప్పించుకున్నారు.
• కడపలో ఉన్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా బీటెక్ రవిని భౌతికంగా లేకుండా చేయాలని ప్రత్యర్ధులు వ్యూహాలు పన్నుతున్నారు.
• బీటెక్ రవికి జరగరానిది ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వందే బాధ్యత.
• ఈ నేపధ్యంలో బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా సెక్యురిటీ పునరుద్దరించండి.

Leave a Reply