Suryaa.co.in

Andhra Pradesh

80 శాతం పూర్తి అయిన కురుబ భవనం పూర్తి చేయలేనోడు మూడు రాజధానులు కడతాడా?

-కురుబ దేవాలయానికి చెందిన 18 భూమిని కబ్జా చేశారు
– మర్యాదగా తిరిగి ఇచ్చేయకపోతే మక్కెలు ఇరగగొట్టి వెనక్కి తీసుకుంటాం
– గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం…బీసీల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్
– రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి
– కుప్పంలో భక్త కనకదాసు విగ్రహావిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

కుప్పం :- తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పంలో కురుబ భవనానికి 1.7 ఎకరాల స్థలం ఇచ్చి రూ.50 లక్షల కేటాయించానని, 80 శాతం పూర్తి చేసిన భవనాన్ని నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా జగన్ పాడుబెట్టారని మండిపడ్డారు. మిగిలి ఉన్న 20 శాతం కురబ భవన నిర్మాణాన్ని చేయలేనోడు మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. జగన్ మాటలు చూసస్తే కోటలు దాటతాయి..చేష్టలు గడప దాటవని ఎద్దేవా చేశారు.

కుప్పంలో పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలోని కురుబ భవన్ వద్ద కురబల ఆరాధ్యదైవం భక్త కనకదాస్ విగ్రహాన్ని శుక్రవారం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ…‘‘కనకదాసు విగ్రహం ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా..ఇది ఎంతో పవిత్రమైన రోజు. కనకదాసు మహాభక్తుడు, బహుముఖ ప్రజ్ణాశాలి. కరుబలకు వన్నె తెచ్చిన వ్యక్తి. కనకదాసు చరిత్రకు తిరుగులేదు. కుల వ్యవస్థపై కనకదాసు రాజీలేని పోరాటం చేశారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణభగవానులు కనకదాసుకు దర్శనం ఇచ్చారంటే అదీ ఆయన గొప్పతనం. కనకదాసుకుని తలుచుకుని నెత్తిన కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు…అది దేవుడి సంకల్పం.

ఒకప్పుడు కురబ అంటే గొర్రెలు మేపేవారు, కంబళ్లు తయారు చేసేవారు. మన నాగరికతను మర్చిపోతే మనం మనుషులం కాదు. దాన్ని గుర్తుంచుకుని భవిష్యతుకోసం కష్టపడాలి. కురుబ కులానికి చెందిన యువత కూడా బాగా చదువుకుని నేడు ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. టీడీపీ వచ్చాక ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. శాంతిపురం మండలం శికకూరుబూరులో రూ.20 లక్షలతో, కదిరి ముత్తనపల్లిలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనాలు నిర్మించాం.

కొటాలలో రూ.6 లక్షలు, ఏపూరులో 7 లక్షలతో కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. కురుబలను రాజకీయం, ఆర్థికం, సామాజికంగా పైకి తీసుకొచ్చి శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత నాది. భవిష్యత్తులో కురబ వర్గానికి చెందిన వారికి టీటీడీ మెంబర్ గా అవకాశం ఇస్తా. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తాం. కురుబలకు సీట్లు ఇస్తాం….ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాం అని చంద్రబాబు అన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చాక కురుబ కార్పొరేషన్ కు రూపాయి కూడా ఇవ్వలేదు. గొర్రెల కాపరులకు పైసా కూడా రుణం ఇవ్వలేదు…మరి దేనికి ఆ కార్పొరేషన్.?

కురుబలను ఉన్నత విద్యా వంతులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటా. గొర్రెలు మేపుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు…ఎండలు, వానల్లో తడుతుస్తున్నారు. చెరువు కంఠంలో మీరు గొర్రెలు మేపుకోవడానికి గతంలో పట్టాలు ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఖాళీ భూములు ఉన్నా, అడవుల్లోనూ మేతకు భూములు కేటాయిస్తాం. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఫాంలు ఏర్పాటు చేస్తాం. సబ్సీడీలో రుణాలు కూడా ఇస్తాం. వారసత్వంగా వృత్తులు వస్తాయి…మారిన ఆధునీకరణకు అనుగుణంగా వృత్తులు కాపాడుతాం. చనిపోయిన గొర్రెల కాపరులకు రూ.10 లక్షల బీమా అందిస్తాం. శాంతిపురంలో కురబ దేవాలయానికి చెందిన 18 భూమిని కబ్జా చేశారు..మర్యాదగా తిరిగి ఇచ్చేయకపోతే మక్కెలు ఇరగగొట్టి వెనక్కి తీసుకుంటాం.

మన భూములు రీ సర్వే చేసి..వారసత్వంగా ఇచ్చిన పాసు పుస్తకాల్లో పైన జగన్ ఫోటో వేసుకున్నాడు. మా తాతగా ఎప్పుడు మారావు జనగ్ అని మీరు నిలదీయండి. పొలాల చుట్టూ రాళ్లుబాది వాటిపై జగన్ దిష్టిబొమ్మరు పెట్టుకున్నాడు. మీ ఆస్తి కూడా మీకు చెందకుండా చేసే కుట్ర చేస్తున్నాడు. రామకుప్పం మండలం, వయపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భారతికి చెందిన సొంత భూమిని 22ఏ ప్రభుత్వ భూమి అని ఆధారాలు మార్చేశారు.

దీంతో మనస్తాపంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు..ఇదే పరిస్థితి అందరికీ వస్తుంది. భారతికి న్యాయం చేసే బాధ్యత నాది. టీడీపీ వెనకబడిన వర్గాల పార్టీ. బీసీల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తాం, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తాం. 42 ఏళ్లుగా టీడీపీని ఆదరిస్తున్న బీసీలు, కురుబలను ఆదుకునే బాధ్యత మాది.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE