Suryaa.co.in

Andhra Pradesh

స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా

– పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

విజయవాడ: నైపుణ్య వంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.

స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని వారి వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. స్వర్ణకారులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సుజానకు అందజేశారు.

స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అర్హులైన పేద స్వర్ణకారులకు ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పెన్షన్ ఇవ్వాలని 272 జీవో సవరించాలని కోరారు. స్వర్ణకారుల ఓట్లతో విజయం సాధించి మంత్రి అయిన వేలంపల్లి శ్రీనివాసరావు వారికి మొండి చేయి చూపించారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. స్వర్ణకారులను పోలీసులు అకారణంగా వేధింపులకు గురి చేయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వర్ణ కారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. నియోజకవర్గంలోని స్వర్ణకారులందరికి 24 గంటలు అందుబాటులో ఉంటానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాటల మనిషిని కాదని చేతలలో చేసి చూపిస్తానని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎం ఎస్ బెగ్ టిడిపి నాయకురాలుకేశినేని శ్రీదేవి బిజెపి నాయకులు పైలా సోమినాయుడు స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ పోతులూరి ఆచారి కోశాధికారి బెగ్ సలీం షేక్ అజావుల్లా స్వర్ణకార సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE