భారత్ లో నిరుద్యోగానికి కారణం ఎవరూ అంటే చాలామంది సమాధానం …
కాంగ్రెస్ పార్టీ అని..
మరికొంత మంది బీజేపీ విధానాలు అని అంటూ ఉంటారు.
కానీ నా అభిప్రాయం ప్రకారం కమ్యూనిస్టులు!
వీరి ట్రాప్ లో హిందువులు, క్రిస్టియన్ లు పడ్డారు…కానీ ముస్లింలు పడలేదు.
అందుకు వారు అభినందనీయులు.
హిందువులు, క్రిస్టియన్స్ ఏ విధంగా పడ్డారు అంటే .. కమ్యూనిస్టులు వారి అనుబంధ విద్యార్థి యూనియన్ లు విద్యాసంస్థలలో, వారి యూనియన్ ద్వారా ప్రవేశించి నూనూగు మీసాల (టీనేజ్)విద్యార్థుల మనసులను కలుషితం చేశారు.
చదివిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని, అందుకు ప్రభుత్వం పై(ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో వున్నా) పోరాడాలి అని .. సుఖంగా బ్రతకాలి అంటే ప్రభుత్వ ఉద్యోగం మినహా మరే పని చేసినా బ్రతుకు దుర్భరం అని.. విద్యార్థుల మనసులలో విష బీజం నాటారు. విద్యార్థులకు ప్రభుత్వాలకు మధ్య అపోహలు పెంచారు.<
దానిని నమ్మి విద్యార్థులు కూడా, చదువు అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసమే అని నమ్మి.. వాళ్ల తండ్రుల జీవనోపాధి అయిన వ్యవసాయం,చిన్న వ్యాపారాలు,చేతి వృత్తులు ,కష్టపడి పని చేయడం లాంటి ఎన్నో ఉపాధి అవకాశాలను వదిలి, నేడు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. కానీ కమ్యునిస్టులను నమ్మని ముస్లిం వర్గం.. హిందువులు, క్రిస్టియన్ లు వదులుకున్న వృత్తులును నమ్ముకొని (అంటే అర్థం ఇతర వర్గాలు వదిలివేసిన వృత్తులను ముస్లిం సమాజం చేపట్టింది అనికాదు. ఇతరులు వదిలేశారు, ముస్లింలు కొనసాగించారు అని మాత్రమే ) వారు జీవనోపాధిలో మిగతా వారి కంటే పైచేయి సాధించారు.
హిందువులు, క్రిస్టియన్స్ వారి తప్పులను ఇప్పటికీ గుర్తించకుండా , ఇంకా ప్రభుత్వ ఉద్యోగంపై అశ తో నిరుద్యోగులు గా మిగిలిపోతున్నారు. ఇప్పటి కార్పొరేట్ రంగం కనుక లేకపోతే , దేశం మరెంతో నిరుద్యోగంతో నిండిపోయేది. నిరుద్యోగం లేకపోతే కమ్యూనిస్టులకు జీవనోపాధి లేదు. అందుకే వారు అంబానీ, అదాని లాంటి వారిపై ఏడుపు.
మనం ఒకటి గమనించాలి. కమ్యూనిస్టులు అధికారాన్ని కోరుకోరు. అధికారం కోసం పోరాడుతున్నట్లు నటిస్తారు. ఎందుకు అంటే అధికారంలోకి వస్తే అభివృద్ధికి కృషి చేయాలి. అది వారికి చేతకాదు.
సుధీర్ఘ కాలం వారు అధికారంలో వున్న పశ్చిమ బెంగాల్, వారి హయాంలో ఏ మాత్రం అభివృద్ధి చెందినది అనేది మనకు తెలియని విషయం కాదు.ఇది నా అభిప్రాయం మాత్రమే.
– ఆర్.శ్రీనివాస్