-నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన యూఎస్ఏ వెళ్తున్న యువకులు
ఏపీలోని నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చి విదేశాలలో ఉద్యోగాలు కల్పించే వేదికగా టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ నిలిచిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశంసించారు. ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో టిడిపి ఎంపవర్ మెంట్ సెంటర్ లో శిక్షణ పూర్తిచేసుకుని యూఎస్ఏ వెళ్తున్న విద్యార్థులు గురువారం నంద్యాల యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
వీరితోపాటు రవికుమార్ వేమూరు ఎన్ఆర్ఐ టిడిపి, మల్లిక్ మేదరమెట్ల- టిడిపి ఎంపవర్ మెంట్ యూఎస్ఏ కోఆర్డినేటర్, గరిమెళ్ల రాజశేఖర్ ఆర్థోపెడిక్ సర్జన్, విశాఖపట్నం ఉన్నారు. టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న బనగానపల్లెకి చెందిన సురేంద్ర టెక్సాస్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్న్‌షిప్ చేయడానికి వెళుతున్నారు.
అనంతపురానికి చెందిన ఇంతియాజ్ పెన్సిల్వేనియాకి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్న్‌షిప్ అవకాశం దక్కించుకున్నారు. విదేశీ అవకాశాలు దక్కించుకున్న యువకులు, ఎన్ఆర్ఐ టిడిపి, టిడిపి ఎంపవర్ మెంట్ నిర్వాహకులను ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ అభినందించారు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఆర్‌ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని టిడిపి ఎంపవర్ మెంట్ లో కామర్స్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు టాలీ కోర్సులో ఉద్యోగ ఆధారిత ఉచిత శిక్షణను గత కొంతకాలంగా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.
అక్కౌంట్స్ లో టాలీ-బుక్ కీపింగ్, సాఫ్ట్‌వేర్ లో జావా, పైథాన్, డేటా అనలిటిక్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపిస్తున్నారు. యూఎస్ఏలో టీచర్, హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గల్ఫ్‌లో ఎలక్ట్రీషియన్ జాబ్స్ కి పంపిస్తున్నారు. పూర్తి ఉచితంగా శిక్షణ అందించి ట్రైనీలు, అప్రెంటిషిప్, ఇంటర్న్‌షిప్ గా విదేశాలలో యువతకి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు చూపిస్తోంది ఎన్ఆర్ఐ టిడిపి.