• విద్యుత్ ఒప్పందాలప్రకారం విద్యుత్ కొనుగోళ్లుజరపకుండా, వాటిని కక్షసాధింపులతో రద్దుచేసి, బహిరంగమార్కెట్లో అధికధరకు విద్యుత్ కొనడం, కమీషన్లకోసం కాదా?
• విద్యుత్ ఒప్పందాలకు విరుద్ధంగా విద్యుత్ కొనుగోళ్లుజరిపి, ప్రజలపై వేలకోట్ల భారం మోపిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం, అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపాలి
• మూడున్నరేళ్లలో ఈప్రభుత్వం బహిరంగమార్కెట్లో రూ.12వేలకోట్ల విద్యుత్ కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపింది
• 3 ఏళ్లక్రితం మిగులువిద్యుత్ లో ఉన్నరాష్ట్రాన్ని మీ ధనదాహంతో మూడున్నరేళ్లలో విద్యుత్ లోటురాష్ట్రంగా మార్చారు
• డిస్కంలు దివాలాతీసేస్థితిలో ఉంటే, గృహాలకు స్మార్ట్ మీటర్లు అంటూ ఆభారాన్ని వాటిపై, ప్రజలపై మోపడం సరైందేనా?
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్
రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, చంద్ర బాబు సోలార్, విండ్, వాటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లను బలోపేతంచేసి, ఏపీని దేశం లోనే మిగులువిద్యుత్ రాష్ట్రంగా నిలిపారని, కానీ జగన్ రెడ్డి కేవలం మూడేళ్లలోనే తన అనా లోచిత, కక్షసాధింపునిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేసి, ప్రజలపై భరించలేని విధంగా విద్యుత్ ఛార్జీలభారం మోపాడని టీడీపీ శాసనసభ్యులు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు.
జూమ్ ద్వారా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయనమాటల్లోనే …
“గతంలో టీడీపీప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను జగన్ బుట్టదాఖలు చేయడమే నేడురాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు ప్రధానకారణం. రాష్ట్రప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ కొనుగోలుచేయకుండా, విండ్, సోలార్ పవర్ ఉత్పత్తిని నీరుగార్చిన జగన్ రెడ్డి బయటనుంచి అధికధరకు విద్యుత్ కొని, ఆభారాన్ని అంతిమంగాప్రజలపై మోపాడు. విద్యుత్ ఉత్పత్తిసంస్థలు తమకు జగన్ ప్రభుత్వంచేస్తున్న అన్యాయంపై కోర్టులకువెళ్లడంతో, చివరకు వాటికి కూడా ప్రభుత్వం డబ్బులుచెల్లించాల్సి వచ్చింది. దాంతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక యూనిట్ విద్యుత్ కొంటే, దానికి రెండుసార్లుడబ్బు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదికాదా? మూడేళ్లలో రాష్ట్రవిద్యుత్ రంగాన్ని దోపిడీచేసిన జగన్ నిర్వాకం అంతిమంగా ప్రజలకు శాపంగామారింది.
బహిరంగ మార్కెట్లో అధికధరకు విద్యుత్ కొనడం కమీషన్లకోసం కాదా?
హిందుజా సంస్థ తక్కువధరకు విద్యుత్ అందిస్తుంటే, దాన్నికాదని బయటినుంచి అధికధర కు విద్యుత్ ఎందుకు కొంటున్నారని కోర్టులు జగన్ రెడ్డిప్రభుత్వాన్ని నిలదీయలేదా? హిందు జా సంస్థనుంచి విద్యుత్ కొన్నా, కొనకపోయినా ఆసంస్థకు ప్రభుత్వం డబ్బుచెల్లించాల్సిన పరి స్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికాదా? 6 నుంచి 7వేలకోట్లు ఇప్పటికే హిందుజాకు చెల్లి స్తున్నారు. భవిష్యత్ లో ఆభారం మరింత పెరుగుతుంది. ఆ భారమంతా మోయాల్సింది ప్రజ లు కాదా? మిగుల్ విద్యుత్ తయారుచేసేలా విద్యుత్ ఉత్పత్తిసంస్థల్ని తీర్చిదిద్దితే, వాటిని కాదని వైసీపీ ప్రభుత్వం బయటఅధికధరలకు విద్యుత్ కొనడం కమీషన్లకోసంకాదా? థర్మల్ విద్యుత్ ఉత్ప త్తి కేంద్రాలను నిర్వీర్యంచేశారు.
సరైన నిల్వలులేకుండాచేసి, బొగ్గుకొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్టీపీపీని మూసేసేదశకు తీసుకెళ్లారు. కేంద్రప్రభుత్వసంస్థలనుంచి తక్కువధరకు విద్యుత్ లభిస్తుంటే, దాన్నికాదని బహిరంగమార్కెట్లో ఎక్కువధరకు కొంటు న్నారు. కృష్ణపట్నంపోర్టుని అదానీకి కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ విధమైన నిర్ణయా లతో ప్రభుత్వంలోని పెద్దలకు లబ్ధిచేకూరుతోంది అని అర్థమవుతోంది.
మూడున్నరేళ్లలో ఈప్రభుత్వం బహిరంగమార్కెట్లో రూ.12వేలకోట్ల విద్యుత్ కొనుగోలు చేసి, ఆభారాన్ని ప్రజలపై మోపింది
మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం బహిరంగమార్కెట్లో రూ.12వేలకోట్ల విలువైన విద్యుత్ కొను గోలుచేసింది. ఆ భారమంతా సామాన్య వినియోగదారులపై మోపారు. రాష్ట్రంలోఉన్న విద్యుత్ ఉత్పత్తిని సక్రమంగా వినియోగించుకోకుండా, బయటనుంచి విద్యుత్ కొంటూ, ప్రజలపై భారం మోపుతూ, విద్యుత్ రంగసంస్థలని కుప్పకూల్చేశారు. చంద్రబాబుగారు ఆక్వారంగానికి ఉచి తంగా విద్యుత్ ఇస్తే, జగన్ దాన్ని యూనిట్ రూ.4లకుపెంచాడు. ఆక్వా-నాన్ ఆక్వా అని విభజించి ఏవోకొద్ది ఆక్వాపరిశ్రమలకే యూనిట్ రూ.1.50పైసలకు ఇస్తూ, మిగిలినవాటికి యూనిట్ రూ.5.85పైసలకు ఇస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తి,సరఫరాలో పక్కరాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితిలేదు. విద్యుత్ కోతలతో ప్రజలతోపాటు, పారిశ్రామికరంగాన్ని దెబ్బతీస్తున్నారు. పరిశ్రమలు మూతపడటంతో అటుయువత ఉపాధిలేక రోడ్డున పడుతున్నారు. విద్యుత్ కోత లతో పరిశ్రమలు ఎలా నడుస్తాయనే ఆలోచన పాలకులకు లేకపోవడం బాధాకరం. మీ అనా లోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగమే కుదేలైంది. సామాన్యులపై మోయలేని విద్యుత్ ఛార్జీల భారంపడింది. మార్కెట్లో యూనిట్ విద్యుత్ రూ.10కి కొంటూఎన్నాళ్లుకాలం వెళ్లబుచ్చుతా రు?
3ఏళ్లక్రితం మిగులువిద్యుత్ లో ఉన్నరాష్ట్రాన్ని మూడున్నరేళ్లలోనే విద్యుత్ లోటురాష్ట్రంగా మార్చారు. విద్యుత్ ఒప్పందాలకు విరుద్ధంగా విద్యుత్ కొనుగోళ్లుజరిపి, ప్రజలపై వేలకోట్ల భారం మోపిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం, అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపాలి.
డిస్కంలు దివాలాతీసేస్థితిలో ఉంటే, గృహాలకు స్మార్ట్ మీటర్లు అంటూ ఆభారాన్ని వాటిపై, ప్రజలపై మోపడం సరైందేనా?
నిన్నటికి నిన్న రాష్ట్రంలో 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. మూడేళ్లక్రితం మిగు లు విద్యుత్ రాష్ట్రంగాఉన్నఏపీని మూడేళ్లలోనే విద్యుత్ లోటురాష్ట్రంగా మార్చారు. మీకు కా వాల్సిన విధంగా సంతకాలుపెట్టి, పనిచేసిన అధికారుల్ని ప్రమోషన్లుఇచ్చి ఢిల్లీకి పంపుతు న్నారు. తప్పుచేసిన అధికారులు, ప్రభుత్వాన్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. రాష్ట్రప్రజల నెత్తిన వేలకోట్ల విద్యుత్ ఛార్జీల అదనపు భారం మోపిన ప్రభుత్వంపై, అధికారులపై ముమ్మా టికీ క్రిమినల్ కేసులుపెట్టాల్సిందే. బ్యాక్ డోర్ లో ఎందుకు అధికధరకు విద్యుత్ కొన్నారు… మీ దోపిడీకోసం కాదా?
ఒప్పందాలప్రకారం విద్యుత్ కొనుగోళ్లుచేయకుండా, వాటిని ఉల్లం ఘించి, వాటినిరద్దుచేసి, ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. చంద్రబాబు ప్రభు త్వంచేసుకున్న ఒప్పందాల్లో తప్పులేదని, అంతా సక్రమంగానే జరిగాయని హైకోర్టు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని కక్షతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దుచేశాడు. ఒప్పందాలు కాదన్నందుకు బయటమార్కెట్లో అధికధరకు విద్యుత్ కొనడం ఒక తప్పయితే, విద్యుత్ కొనకపోయినా, ఒప్పందాలకు కట్టుబడి సంస్థలకు డబ్బులుకట్టడం మరోపెద్దతప్పు. ఈ ఫలితాలకు బాధ్యతవహించాల్సింది జగన్మోహన్ రెడ్డికాదా? ఇప్పటికే రూ.60వేలకోట్ల లోటులో నడుస్తూ, ఆర్థికంగా డిస్కంలు దివాలాతీసే పరిస్థితిలోఉంటే గృహలకు స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ సంస్థలపై అదనపుభారం మోపడం సరైందేనా? విద్యుత్ సంస్థలతో పాటు, ఆ భారం వినియోగదారులు భరించాల్సిందే కదా! విద్యుత్ సంస్థల్ని ఆర్థికంగా పరిపుష్టంచేసే ఆలోచనలు చేయకుండా ఇలాంటి నిర్ణయాలతో వాటిని మూసేయిస్తారా? కేంద్రప్రభుత్వ నిబంధనల కన్నా ఎక్కువ ధర పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వం సమాధానంచెప్పాలి
దేశంలో ఇతరరాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేసిన థర్మల్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, ఏపీకి మాత్రమే బొగ్గు సరఫరా ఎందుకు ఆపేశాయి. ముందు డబ్బులు కడితేనే బొగ్గు సరఫరా చేస్తామని ఎందుకు చెప్పాయి? అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కాకుండానే 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దాదాపు రూ.50వేలకోట్ల భారం సామాన్య వినియోగదారులపై మోపారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఏవో అక్రమాలు జరిగాయని ఊహించుకోవడం, మీ మనుషు లకు సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలనుంచి హైకాస్ట్ పవర్ కొనడం, విద్యుత్ ఒప్పందాల ప్రకారం రాష్ట్రంలో కొనుగోలు చేయడానికి విద్యుత్ అందుబాటులో ఉన్నా కూడా దాన్ని కాదని బయట అధిక ధరకు కొనడం.. వెరసి రాష్ట్ర విద్యుత్ రంగం పతనం. మూడేళ్లలో మీరు చేసింది ఇది కాదా… దీనిపై విచారణకు ఈ ప్రభుత్వం సిద్ధమా? ఈ పాపాలకు బాధ్యులు ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం కాదా? వారికి సలహాలిచ్చి, వారుచెప్పిందిచేసిన అధికారు లుకాదా?
7మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటే కోతలు లేవని చెబుతారా?
రాష్ట్రంలో 7మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత స్పష్టంగా కనిపిస్తుంటే విద్యుత్ కోతలు లేవని ఎలా చెబుతారు? ఇళ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి అన్నింటికీ ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధిస్తూ ఇంకాసిగ్గులేకుండా కోతలులేవని చెబుతారా? మీరు తీసుకున్న అనాలోచిత , కక్షసాధింపు నిర్ణయాలు, మీలబ్ధికోసం తీసుకున్న స్వార్థ నిర్ణయాలే రాష్ట్ర విద్యుత్ రంగానికి శాపాలుగా మారాయి. విద్యుత్ సంస్థలు తీవ్రమైన నష్టాల్లో కూరుకున్నాయి.
సామాన్యులపై మోయలేని భారం పడింది. ఇంత జరిగినా ఆగకుండా మరలా స్మార్ట్ మీటర్ల పేరుతో మరో 6ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులపై భారం పడేలా తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యుత్ రంగంలో అనేక అక్రమాలు జరిగాయని కోర్టులకు వెళ్లారు. అలాంటివారు ఇప్పుడు ఈ 4ఏళ్లలో జరిపిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా.” అని పయ్యావుల నిలదీశారు.