– హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు చేసిన బాధితుడు
– బాధితుడు కూడా టీఆర్‌ఎస్ కార్యకర్తనే
కష్టార్జితంతో కొనుక్కున్న తన భూమిని జాగృతి నాయకులు ఆక్రమించుకున్నారని టీఆర్ఎస్ పార్టీ కి చెందిన బాధితుడు రమేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఉప్పల్ చిలుకానగర్ లోని 153 గజాల స్థలాన్ని 2017లో కొనుగోలు చేసినట్లు బాధితుడు కమీషన్ కు వివరించారు.
ఈ భూమిపై కన్నుపడ్డ మేడ్చెల్ జిల్లా జాగృతి కన్వీనర్ ఈగ సంతోష్ నకిలీ పత్రాలు సృష్టించి తనదే భూమి అంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసారు. ఉప్పల్ ఎమ్మెల్యే తో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటన పై ఉప్పల్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
న్యాయం చేయవలసిన పోలీసులు భూ కబ్జాదారులతో కుమ్మకై వేధింపులకు గురి చేస్తున్నారని… పోలీసులపై , జాగృతి నాయకుడు ఈగ సంతోష్ పై చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పించాలని హెచ్చార్సీ ని వేడుకున్నారు.