Suryaa.co.in

Sports Telangana

కంగ్రాట్స్ బ్రదర్‌!

వీవీఎస్‌ లక్ష్మణ్‌కి అభినందనలు చెప్పిన కేటీఆర్‌
జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎన్‌సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్‌ సోమవారం విధుల్లో చేరారు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
‘జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన సోదరుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌కు అభినందనలు. జెంటిల్‌మెన్ అయిన నీతో పాటు.. రాహుల్‌ ద్రవిడ్‌ సారధ్యంలో భారత క్రికెట్‌ మరింత గొప్పగా, అద్భుతంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని కేటీఆర్‌ మంగళావారం ట్వీట్ చేశారు. ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ జట్టు అద్భుత ప్రతిభ చూపనుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE