28న విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ

విజయవాడ: ఈనెల 28న విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ, వైసీపీ ఒకటేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది.
కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, గడ్కరీ, అమిత్ షాలలో ఎవరో ఒకరిని బహిరంగ సభకు వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో మతమార్పిడులు, కులాధిపత్యం, ఆర్థిక అరాచకం, ఇతర పార్టీల నేతలపై దాడులు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని కోర్ కమిటీ భావించింది. బహిరంగ సభ స్థల నిర్ణయం, అనుమతి కోసం కమిటీని నియమించింది. కేంద్ర మంత్రి మురళీధరన్ నివాసంలో గత రాత్రి 12 గంటల వరకు కోర్ కమిటీ భేటీ జరిగింది. ఏపీలో పోలీసుల ఏకపక్ష వైఖరిపై హోంమంత్రిత్వ శాఖకు సాక్ష్యాధారాలతో సహా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. నాలుగు గంటలపాటు జరిగిన కోర్ కమిటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a Reply