– ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో పేదలను దోచుకుంటున్న ప్రభుత్వంపై టీడీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ప్రదర్శనలు విజయవంతమయ్యాయి. నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని టీడీపీ శ్రేణులు బ్రహ్మాండంగా పోరాడారు. మీ పోరాటానికి నా అభినందనలు. ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతున్న మా పార్టీ నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచకుపడ్డారు.
పోలీసుల చర్యను ఖండిస్తున్నాం. పేదల కోసమే టీడీపీ పోరాడుతుంది. దశాబ్ధాల క్రితం కట్టిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ల పేరుతో జగన్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. బలవంతం ఏమీ లేదని పైకి చెప్తూ.. ఓటీఎస్ కు డబ్బులు చెల్లించకుంటే పథకాలు ఆపేస్తామని పేదలను బెదిరిస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గం పరాకాష్టకు చేరింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పీల్చుకుతింటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలి. సంపద సృష్టించడం చేతకాక రకరకాల కుయుక్తులు పన్ని ప్రజలపై పన్నులు మోపుతున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పేదల పక్షాన టీడీపీ పోరాడుతుంది.