స్వతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ తమ కమ్యూనిస్టు రష్యా వైపు మొగ్గు చూపడం, సోషలిస్టు విధానాలు అవలంబించడంతో, వామపక్ష మేధావులకు నెహ్రు అంటే సాఫ్ట్ కార్నర్. నెహ్రు కూడా వీళ్ళను మచ్చిక చేసికుందికి భారత విద్యావిధానాన్ని, భారతీయ ఘనమైన చరిత్రని తమకు అనుకూలంగా వక్రీకరించుకునే అవకాశం ఉన్న పదవుల్లో వీళ్ళని కూర్చోబెట్టాడు. అందుకే ఈ వామపక్ష మేధావులు కాంగ్రెస్ కి వంతపాడతారు.
ఇదే కాక కాంగ్రెస్ సుమారు 60 సం. లు పాలించింది కాబట్టి సహజంగానే అన్ని వ్యవస్థల్లో కాంగ్రెస్ అనుకూల కుటుంబాలు పాతుకు పోయాయి. తమ పాలనలో లబ్ది పొందిన కొందరు మేధావులు, పత్రికాధిపతులు, లాయర్లు, విలేఖరులు , కళాకారులు, NGO s ని ఇంకా కొందరు బ్రోకర్లు (వీరు సాధారణంగా రిటైర్డ్ IAS, IPS, సైనికోద్యోగులు) వంటి వారితో కలసిన బలమైన ముఠాని ఏర్పాటు చేసుకుంది.
సోషల్ మీడియా రాక ముందు వీరు చెప్పిందే మీడియాలో వచ్చేది. అదే ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేది. పేరుకే వామపక్ష భావజాలం కానీ వామపక్ష పార్టీలు కూడా ‘అవినీతి’ కంటే ‘మతతత్వమే ప్రమాదం’ అని తీర్మానించేసి కాంగ్రెస్ పార్టీ కి మిగతా ‘అవినీతి, కుల, కుటుంబ, ప్రాంతీయ’ పార్టీలకు “సెక్యూలర్” అన్న బిరుదు తగిలించి ఏ మాత్రం సిగ్గుపడకుండా కొమ్ముకాశాయి.
సుమారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 2014 వరకు, నిరాటకంగా ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తున్న ఈ ముఠా ఆధిపత్యాన్ని ఈ ముఠాకి అస్సలు సంబంధం లేని వాడు, 10 సం. లుగా వాడిపై ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా తట్టుకొని నిలబడి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం ఈ ముఠా అస్సలు ఊహించలేదు.
వారు ఊహించింది ఏమిటంటే ఒకవేళ 2014లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఒంటరిగా అధికారంలోకి రాదు. కనీసం తాము పెంచి పోషించి సమర్థిస్తూ వచ్చిన ఏవో కొన్ని కుల, కుటుంబ ప్రాంతీయ “సెక్యూలర్” పార్టీల సహకారం అవసరం పడుతుంది. ఈ పార్టీలవారు ఖచ్చితంగా మోడీని ప్రధానిగా ఒప్పుకోరు.
మళ్లీ ఎన్డీయేలో ఒక మన్మోహన్ లాం వాడిని ప్రధానిగా కూర్చోబెట్టి తమకు అనుకూల సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ ముఠా నాయకురాలిని కూర్చోబెట్టవచ్చు. అదీ కుదరకపోతే అధికారంలో ఉన్న తమ ” కుల,కుటుంబ, ప్రాంతీయ “సెక్యూలర్” పార్టీల నాయకుల ద్వారా పనులు చక్కబెట్టుకుంటూ మళ్లీ ఎన్నికల దాకా ఎదురు చూడవచ్చు అని అనుకున్నారు.
RSS, బీజేపీ బూచి చూపించి మైనార్టీలను, అగ్రకులాల బూచి చూపించి SC, ST, BC లను గట్టి ఓట్ బ్యాంక్ లుగా తయారుచేసుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకుంటే ఒక జాతీయ పార్టీతో కలసి దేశం అంతా ఉన్న ఈ కుల సెక్యూలర్ పార్టీలు, మత సెక్యూలర్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యవలసిందే తప్ప మరొకరికి అవకాశం లేని విధంగా రాజకీయాలు నడిపారు.
వీరిని కాంగ్రెస్ ఎంతలా మేపింది అంటే .. UPA టైం లో కాంగ్రెస్ రాజ్యాంగేతర సూపర్ కాబినెట్ (NAC) అని పెట్టి సోనియాను చైర్ పర్సన్ గా, ఈ ముఠాలోని కొందరిని సభ్యులుగా (యోగేంద్ర యాదవ్, హర్ష మందర్ మొ.వాళ్ళు) వేసుకొని ప్రభుత్వ ఖర్చుతో పెంచి పోషించింది .. వీరు చెప్పిందే ప్రధాని మరియు మంత్రిమండలి పాటించాలి. ఆ టైంలో వీరికి ప్రభుత్వంపై గల పట్టు గురించి తెలుసుకుందుకు మన్మోహన్ మీడియా కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం “ఆక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ “చదవండి.
ఇక రాడియా టేపుల ద్వారా బయటపడిన ప్రముఖ బరఖా దత్ లాటి యాంకర్ ఎవరు మంత్రులుగా ఉండాలో నిర్ణయించే బ్రోకర్లుగా పని చేశారు అంటే ఈ విలేఖరుల ముసుగులో ఉన్న బ్రోకర్లకు ప్రభుత్వంలో ఎంత పలుకుబడి ఉండేదో అర్ధం చేసుకోండి.
ట్విట్టర్ లో వస్తున్న రక రకాల కథనాల ప్రకారం, సాధారణ ఏంకర్లు, విలేఖరులుగా పనిచేసిన వారు వంద కోట్లకు తక్కువ కాకుండా ఆస్తులు కూడ బెట్టారుట.ఎలా అంత సంపాదించగలిగారు?ప్రభుత్వంలో ఉండే పెద్దలతో సఖ్యంగా మెలుగుతూ. ….వీరికి అతి చవగ్గా ఢిల్లీలో ముఖ్య ప్రదేశాల్లో విశాలమైన భవనాలు, అతి చవగ్గా వేల కొద్దీ sq. yds ఇళ్ల స్థలాలు, పద్మ అవార్డులు. ఇలా ఒకటేమిటి ఏది కావాలంటే అది వచ్చి వళ్ళో వాలేది.అందుకే 2014లో మోడీ అధికారంలోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. 2002 నుండి మోడీని ఎన్ని విధాలా ఇబ్బంది పెట్టినా అన్ని తట్టుకుంటూ అలా పెరుగుతూ ఎలా వస్తున్నాడు అన్నది వీళ్ళ బానిస మెదళ్లకు అంతుచిక్కలేదు.సరే మరి మోడీ అంటే వీరికి ఎందుకు కోపం?పూర్వం కాంగ్రెస్ పాలనలో పొందిన ఈ కింది సదుపాయలన్ని ఫాసిస్ట్ మోడీ వచ్చాక పోయాయి.మరి వీళ్లకు కడుపు మండదూ?
మోడీ ప్రభుత్వం వచ్చాక వీరికి అధికార కారిడార్లు దూరం అయిపోయి, పలుకుబడి తగ్గిపోయింది. బ్రోకర్ పనులు చేసి డబ్బులు సంపాదించే దారులు మూసుకు పోయాయి.ఢిల్లీలో ముఖ్య ప్రదేశాలలో వీరి కబ్జాలో అనధికారికంగా ఉన్న సుమారు 2200 ప్రభుత్వ భవనాలను బలవంతంగా ఖాళీ చేయించారు.ప్రధానితో, మంత్రులతో ఉచిత విదేశీ ప్రయాణాలు, అక్కడ ఉచిత 5 స్టార్ వసతి, మందు పార్టీలు, బహుమతులు పోయాయి. మోడీ ఒక్క దూరదర్శన్ స్టాఫ్ ని మాత్రం తీసుకువెళ్తున్నారు. ప్రైవేట్ మీడియా వారిని ప్రభుత్వ ఖర్చుతో తీసుకువెళ్లడం లేదు.
వీరి గ్రూప్ కి పద్మశ్రీలు పోయాయి. ఇప్పుడు అన్ని అవార్డ్స్ ఎవరో మొక్కలు పెంచిన అనామకుడికో లేక కేరళలో వెయ్యికి పైగా ఉచిత కాన్పులు చేసిన ముసలి నర్సుకో ,ఒరిస్సాలో ఏ పనికిరాని ఆదివాసీ కవికో వస్తున్నాయి.వీరు ఎదో కమిటీల్లో సభ్యులుగా దూరి ప్రభుత్వ ఖర్చుతో సకల సదుపాయాలు పొందే అవకాశం కోల్పోయారు.రాజ్య సభ టివి(ఇది ఉపరాష్ట్రపతి గారి ఆధీనంలో ఉంటుంది) లో శ్రీమాన్ సిద్ధార్థ వరద రాజన్ THE WIRE వెబ్ పోర్టల్ వ్యవస్థాపకుడు కి ( https://m.facebook.com/story.php*?*story_fbid=10217493853121875&id=1342642958)
మోడీ ప్రధానిగా వచ్చాక కూడా శ్రీమాన్ హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా వున్నప్పుడు రాజ్యసభ టీవీ లో “మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ నిర్వహించడానిక ఒక్కో ప్రోగ్రాం కి రు. 15000 చొప్పున మొత్తం అక్షరాల 33 లక్షల రూపాయలు ముట్టచెప్పారు. అదే వైర్ లో పని చేస్తున్న మరో వామపక్ష పాత్రికేయుడు MK వేణుకు ఇటువంటి పనికే మరో ₹14.70 లక్షలు ముట్ట చెప్పారు.
అంటే రూడ్ గా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఉండగా ప్రభుత్వ టివి లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం నడిపినందుకు అప్పనంగా ప్రజలు సొమ్ము సుమారు 50 లక్షలు వీరికి ధారపోసి తాము ప్రభుత్వం లో ఉన్నా లేకపోయినా కావలసినప్పుడు మొరగడానికి వీలుగా, ఈ రెండు విశ్వాస కుక్కలను తయారు చేసుకున్నారు అన్న మాట. మరి వీరికి వ్యతిరేక ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఇంతగా దోచిపెడితే వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎంత దోచిపెట్టి ఉంటారో ఊహించలేం.
వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అవ్వగానే, వీరి ప్రోగ్రాం రెన్యూ చెయ్యలేదు. అందుకే మోడీ ప్రభుత్వం అంటే సిద్ధాంత రీత్యానే కాదు ‘”మా కడుపులు కొట్టాడండీ”అన్నది సిద్దార్ద్ కి ,వేణుకి కడుపు మంటకి కారణం. అందుకే ‘ద వైర్’ పోర్టల్ నిండా పుంఖాను పుంఖాలుగా మోడీ వ్యతిరేక వ్యాసాలు/వార్తలు వస్తాయి.
పైకి తెలిసి ఇటువంటివి. మనకు తెలియకుండా వెనుక నుండి ప్రకటనల రూపంలో లేదా వీరికి చెందిన వాళ్ళకి ఏవైనా కాంట్రాక్టులు రూపంలో ప్రజల సొమ్ము వీరికి ఎంత ధార పోసి ఉంటారో పై వాడికే ఎరుక.
మొన్న రాజ్ దీప్ సర్దేశాయి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. 2002 అల్లర్లులో మోడీ బాధ్యత లేదు. మేమే మీడియా వాళ్ళం హైప్ క్రియేట్ చేసాం అని ఒప్పుకున్నాడు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ లో ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రసారం చేసాం అని మొన్న హైదరాబాద్ కోర్టుకి ఒప్పుకోని పరువునష్టం దావా నుండి బయటపడ్డాడు .ఇదే “పద్మశ్రీ రాజ్ దీప్ సర్దేశాయి” ఎందుకు చేశాడు? ఎవరు చేయించారు? అని చెప్పడు. ఆఫ్టర్ అల్ ఒక పాత్రికేయుడు 50 కోట్ల బంగ్లా ఎలా సంపాదించాడు అది కూడా చెప్పలేదు.
ఇటువంటి వారికి పద్మా అవార్డ్స్ , కోట్ల ఖరీదు చేసే ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్. మరి వీళ్ళు వంత పాడకుండా ఎలా ఉంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం అయితే ఎలా తట్టుకోగలరు?
అందుకే 2014 ముందు 2002 గుజరాత్ గొడవలు, సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేస్, ఇశ్రాత్ జహన్ కేస్ ఏదీ వదలకుండా తమ మీడియాలో 24/7 కవర్ చేశారు. సుశాంత్ హత్య కేసు, బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మీడియా విచారణను ఇప్పుడు తప్పు పడుతున్న ఈ మీడియా ముఠాకి 2002 నుండి మోడీపై వీరు చేసింది గుర్తుకు రాదు. కానీ 2014 కి సోషల్ మీడియా బలంగా రావడం కొందరు జాతీయ వాద ఏంకర్స్ (అర్ణబ్ రెపబ్లిక్ టివి, సుధీర్ చౌదరి జీ న్యూస్ మొ. వారు) బయటకు రావడంతో వాజపేయి టైంలో నెగ్గిన నెగటివ్ పబ్లిసిటీ 2014లో, 2019లో కూడా పనిచేయలేదు.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి, ఈ ముఠా రోజుకో కొత్త అంశం తెరమీదకు తేవడం లేదా ప్రభుత్వ చర్యలను తమ మీడియా ద్వారా నెగటివ్ గా ప్రాజెక్ట్ చెయ్యడం మొదలుపెట్టాయి.మోడీ అధికారం చేపట్టిన వెంటనే 2015 లో వచ్చిన ఢిల్లీ ఎన్నికలతో ఈ రకమైన ఆధారం లేని వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. ఎవరో దొంగలు ఒకటి రెండు చోట్లా చర్చ్ లు అద్దాలు పగలకొట్టి వస్తువులు ఎత్తుకుపోతే(ఇది హిందూ దేవాలయాల్లో ప్రతీ ఊర్లో సర్వసాధారణం) ఇవి హిందూ సంస్థలు చేశాయి అని 24/7 కవర్ చేశాయి, ఢిల్లీ ఎన్నికలు అయిన వరకు మాత్రమే. ఆ తరువాత ఆ విషయం పై ఒక వార్తా కానీ వ్యాసం కానీ చర్చ కానీ రాలేదు.
అలాగే వెస్ట్ బెంగాల్ లో 71 సం. ల నన్ రేప్ కి గురి అయితే కనీసం ప్రాధమిక దర్యాప్తు కూడా జరపకుండా భజరంగ్ దళ్ సభ్యులు చేశారు అని టీవీ డిబేట్లు ప్రపంచ మీడియాలో వచ్చే వరకూ కూడా రోజూ కథనాలు. చివరకు అది ఒక బంగ్లా దేశ అక్రమ ముస్లిం శరణార్థి పని అని తేలడంతో ఆ విషయం గోతిలో కప్పెట్టేశారు.కానీ పాలఘర్ సంఘటనకు మతంతో ముడిపెట్టకూడదు అని సుద్దులు చెపుతారు.ఢిల్లీ మోడల్ సక్సెస్ చూసాక రోహిత్ వేముల, ఆఖలక్ మృతి ఇలా చాలా ఇష్యూస్ హై లైట్ చేశారు. అవార్డ్
వ్యాపిసి గ్యాంగ్ అవార్డ్స్ కూడా వాపస్ చేశారు(అవే కాగితమ్ముక్కలు, ట్రోఫీలు మాత్రమే వాపస్ చేశారు. డబ్బులు మాత్రం వాపస్ చెయ్యలేదు)అది మొదలు JNU లో కన్హయ్య, గుజరాత్ లో హార్దిక్ పటేల్ ఇలా కొత్త కుర్రాళ్ళని ప్రాజెక్టు చేశారు. ప్రతీ రాష్ట్రంలో కుల గొడవల చిచ్చు పెట్టారు.
మొన్న సాధువులు కాంగ్రెస్ పాలిస్తున్న మహారాష్ట్రలో కాకుండా యోగి పాలిస్తున్న యూపీ లో ఇలాగే ఇద్దరు ముస్లిమ్ మత పెద్దలు ఏ మూకుమ్మడి దాడిలో చనిపోయి ఉంటే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండేదో ఊహించండి. ఎంత మతం రంగు పులిమేవారో ఊహించండి. మైనార్టీలకు మోడీ పాలనలో ఎంత రక్షణ కరువైందో వాళ్ళ టీవీ ల్లో గంటలు గంటలు చర్చలు పెట్టేవారు.
ఈ మధ్యనే అందరూ ఖండించవలసిన, గర్హించదగ్గ ఒక హత్రాస్ రేప్ సంఘటన యోగి ప్రభుత్వం కాబట్టి అంతర్జాతీయ మీడియా, యూఎన్ వరకు ఈ ముఠా ఒక ప్లాన్ ప్రకారం ఎలా తీసుకువెళ్లారో చూసారు కదా! రోజూ ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మీడియాలో వాటికి ప్రాధాన్యతా వార్తలుగా రాకుండా జాగ్రత్తపడి తమ యజమానులను రాజకీయ, సామాన్య ప్రజల దాడుల నుండి కాపాడుతారు అన్న మాట.
ఇటువంటి ఫార్ములాలే వాడి, 2014 లో మోడీని అధికారంలోకి రాకుండా, 2019లో దింపేద్దాం అని కలలు కంటూ అవే అస్త్రాలు వాడారు. కానీ దశాబ్దాల బట్టి తమ ముఠాను పోషిస్తున్న తమ సెక్యూలర్ పార్టీలు తయారు చేసుకున్న కుల, మత ఓట్ బాంక్ లకు గండి కొట్టి జాతీయతా నినాదంతో 2014లో మోడీ అధికారంలోకి వచ్చాడు, 2019లో అధికారం నిలబెట్టుకున్నాడు.
రెండు వరస ఎన్నికల్లో దెబ్బతిన్నా వీరిలో ఏ మార్పు రాలేదు. ఉదాహరణకు తీసుకోండి. మొన్న మొన్నటి వరకు ఈ ‘సెక్యూలర్’ ముఠాకు, శివసేన బద్ద శత్రువు. ఆ పార్టీని తిట్టని రోజు లేదు. కానీ ఎప్పుడు అయితే శివసేన ఈ ముఠాతో జత కట్టిందో ఈ ముఠా సభ్యులందరూ ఒకే మాట మీద ఆ కుటుంబాన్ని వెనకేసుకు వస్తున్నారు, ఆ పార్టీపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. దీనినే విశ్వాసం చూపించడం అంటారు. ఈ ముఠా ఈ విషయంలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంది.
ఈ ముఠా తమకు అడ్డుపడుతున్న ఏ శక్తులను అయినా నిర్ధాక్షిణ్యంగా లేపేయ్యడానికి కూడా వెనుకాడరు. వీరి మొట్టమొదటి టార్గెట్ మోడీ…ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయన నమ్మకస్తులు.
గమనిక: ఈ వ్యాసం రచయిత సొంత అభిప్రాయం మాత్రమే
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు