Suryaa.co.in

Telangana

దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన మైనారిటీ యువతీ, యువకులు
రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి

దేశంలో బిజెపి మతతత్వ వాదాన్ని పెంచుకునేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మైనారిటీ యువతీ, యువకులు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేతకాని విధానాల వల్ల దేశంలో బిజెపి మతతత్వ వాదాన్ని పెంచుకున్నదని, దేశంలో అస్థిరతకు కాంగ్రెస్ పార్టీయే కారణం అయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లీం వర్గ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించందని, దాని ప్రభావంతో దేశంలో బిజెపి మతతత్వ బీజాలు వేసిందని, కాంగ్రెస్, బిజెపి పార్టీల పాపాల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బిజెపి తప్పుడు విధానాల వల్ల దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాన్ని దెబ్బ తీసిందని, బిజెపి మతతత్వ వాదాన్ని పెంచి పోషించింది అని, తద్వారా ప్రజాస్వామ్యం చిన్నాభిన్నం అయిందని వినోద్ కుమార్ వివరించారు.కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపి మాయమాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీ వర్గాల వారి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వినోద్ కుమార్ తెలిపారు.రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వినోద్ కుమార్ అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, తెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, పవర్ లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE