Suryaa.co.in

Telangana

కేసీఆర్ తో టచ్ లో కాంగ్రెస్ సీనియర్లు

– బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూసే ప్రసక్తే లేదు.
– రేవంత్ కోతల రాయుడు
– కాంగ్రెస్ లో చేరిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల గొంతు ను రేవంత్ తడిబట్టతో కోశారు
– కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు
ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో మోసం చేశారు ? ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ హాయం లో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాము.

చేతి వృత్తుల వారికి కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారు. చేతి వృత్తుల వారు నేడు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నాయి బ్రాహ్మణులకు కరెంటు చార్జీల్లో రాయితీ ఇవ్వక పోవడం తో వారు రోడ్ల పైకి వస్తున్నారు. మత్స్య సంపద పై ఆధారపడ్డ కుటుంబాలు నాలుగు లక్షల దాకా ఉన్నారు వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో ఏ సాయం అందడం లేదు.

మత్స్య పారిశ్రామిక సంఘాల కు వంద శాతం సబ్సిడీ తో కేసీఆర్ పథకాలు ఇచ్చారు. చేపల ఉత్పత్తి 2200 కోట్ల రూపాయల నుంచి నుంచి 6200 కోట్ల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. చేప పిల్లలు కేసీఆర్ హాయం లో ఉచితంగా ఉచ్చేవారు. పని ముట్లు ఉచితంగా ఇచ్చారు కేసీఆర్.

50 శాతం ఇస్తామన్న చేప పిల్లలు రేవంత్ ఇంకా ఇవ్వలేదు రేవంత్ కోతల రాయుడి గా మారారు. మత్స్య కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగడం లేదు. కేవలం 12 జిల్లాల కే ఎన్నికలు జరిగాయి. మిగతా 21 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించాలి. వాటికి ఎన్నికలు జరిగితేనే రాష్ట్ర స్థాయిలో చైర్మన్ ఎన్నికకు అవకాశం ఉంటుంది.

అన్నింటా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తో ముందుకు సాగుతున్నారు. వెంటనే మత్స్య సంఘాలకు ఎన్నికలు జరపాలి ..వారికి రావాల్సిన సాయాన్ని వెంటనే అందించాలి. కుల వృత్తులకు రావాల్సిన వాటి పై ప్రభుత్వం స్పందించక పోతే బీ ఆర్ ఎస్ ఆందోళన బాట పడుతుంది.

చేయాల్సినవి చేయడం చేతకాక రేవంత్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాము ..ఇక ఊరుకోము. రేవంత్ అరాచక పాలన పై అసెంబ్లీ లో నిలదీస్తాం. గ్యారంటీలు ఇచ్చి అమలు చేయని వైనాన్ని అసెంబ్లీ లో లేవనెత్తుతాం. ఈ సీఎం పై కాంగ్రెస్ మంత్రులు ,ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదు.రేవంత్ కు కాంగ్రెస్ పై పట్టు ఉంటే మంత్రి వర్గ విస్తరణ చేసేవారు.

కాంగ్రెస్ లో చేరిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల గొంతు ను రేవంత్ తడిబట్టతో కోశారు. కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతలు మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు. మా నేతల పై కావాలని కేసులు నమోదు చేస్తున్నారు. ఇది శాస్వతంగా ఉండే ప్రభుత్వం కాదని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూసే ప్రసక్తే లేదు.

బస్తీ దవాఖానాల్లో మందులు లేవు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నా నియోజక వర్గం లోని బస్తీ దవాఖాన ల్లో పరిస్థితులను గమనించేందుకు ఈ రోజు పర్యటించాను. ఒక్క బస్తీ దవాఖానాల్లో మందులు లేవు. ఏడెనిమిది నెలలుగా బస్తీ దవఖానాల్లో మందులు లేవని డాక్టర్లు ,రోగులు చెబుతున్నారు. ఇది రేవంత్ ఏడాది పాలనకు అద్దం పడుతుంది.

ఇందుకేనా కాంగ్రెస్ వాళ్ళు పండగలు పబ్బాలు చేసుకునేది ? కాంగ్రెస్ ఎపుడ అధికారం లోకి వచ్చినా ప్రజలకు కష్టాలు తప్పవు. ఆరోగ్య మంత్రికి ప్రజల కష్టాలు పట్టడం లేదు. మేము కట్టిన ఫ్లై ఓవర్లకు రంగులు వేసి తమవిగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. stp లు మేము నిర్మిస్తే వారివిగా చెప్పుకుంటున్నారు. కరెంటు కోతలు కూడా నిత్య కృత్యం అయ్యాయి. బస్తీ దవాఖానాల్లో పరిస్థితులు మెరుగు పరచక పోతే బీ ఆర్ ఎస్ ఉద్యమానికి సిద్ధం అవుతుంది.

LEAVE A RESPONSE