అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీని నిర్మాణానికి 1,200 ఎకరాలు కేటాయించాలని కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారును కోరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. పేరో భూమి చూపిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలుకానుంది. అనంతపురం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.