Suryaa.co.in

Telangana

నాపై కుట్ర

-కొడంగల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం
-బీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండూ రెండే
-ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా ండ్డి గెలిచి మంత్రి అయ్యారు..ఆ తరువాత ఈ నియోజవర్గం నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం రాలేదు…ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా సోనియమ్మ నాకు అవకాశం ఇచ్చారు..వందరోజుల్లో కొడంగల్‌ నియోజకవర్గానికి మెడికల్‌, ఇంజనీరింగ్‌, వెటర్నరీ, నర్సింగ్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నాం..వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చుకు న్నాం..రూ.4 వేల కోట్లతో నారాయణ్‌ పేట్‌- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నాం.

కొడంగల్‌లో కాంగ్రెస్‌ను ఓడిరచి రేవంత్‌ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు.. ఎందుకు రేవంత్‌ రెడ్డిని కిందపడేయాలి..? కరువు ప్రాంతమైన కొడంగల్‌కు నారాయణ్‌ పేట్‌- కొడంగల్‌ ఎత్తి పోతల తెచ్చినందుకా? కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణమ్మ.. పాలమూ రు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేకపోయారని విమర్శించారు. కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయొద్దని ఆమె కుట్ర చేస్తోంది..కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీజేపీ, బీఆరెస్‌ కుట్రలు చేస్తున్నాయి.. చెప్పినట్లు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, కేసీఆర్‌లా మోసం చేయలేదని విమర్శించారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పార్లమెం ట్‌ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE