Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతి ఘటనలో కుట్ర కోణం

– శవ రాజకీయం చేయడం వైసీపీకి అలవాటు
– ముందే వైసీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఎలా వచ్చాయి?
– టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

తిరుపతి: తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తోంది. అందరి కంటే ముందే వైసీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఎలా వచ్చాయనేది దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియాలో టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు.

ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆక్షేపించారు ఎంఎస్ రాజు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ జరగాల్సి ఉంటే తిరుపతి ఘటన వల్ల రద్దయిందని అన్నారు.

LEAVE A RESPONSE