Suryaa.co.in

Andhra Pradesh

దస్తగిరి అప్రూవర్ గా మారడంలో కుట్ర

– వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అరోపణలపై స్పందించిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి

వైఎస్ఆర్ జిల్లా : నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. జైల్లో ఉండే వారి అరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను. జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

మెడికల్ క్యాంపుకు వెళ్లినప్పుడు నాతో పాటు జైలు అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. జైల్లో ప్రతి చోట సిసి కెమెరాలు ఉంటాయి. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని.

మూడు నెలల అనంతరం ఫిర్యాదు చెయ్యడంలో ఆంతర్యమేమిటి ?దస్తగిరి ఎవరి డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడో అందరికి అర్థమవుతుంది. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదు.

ఇప్పుడు మా నాన్న శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తుంది.ఇదంతా కేవలం బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఈ కథలన్ని అల్లుతున్నారు. బెయిల్ తిరష్కరణకు గురైన తరువాత మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఎమీ ఉండవు . దస్తగిరి అప్రూవర్ గా మారడంలోను కుట్ర దాగుంది .

 

LEAVE A RESPONSE