– మోదీ ని దిగ్బంధనం చేయాలనే కుట్ర ఉందా ?
– భారత్‌పై అమెరికా, ఉక్రెయిన్ విషప్రచారం
ఖచ్చితంగా ఉంది! అసలు రష్యా దళాలు ఉక్రెయిన్ లో ప్రవేశించగానే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేనోస్కి తో ఈ కుట్రని అమలు చేయిస్తున్నది NATO,అమెరికా లు. మొదట భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి చేత మహా భారత, చాణుక్యుని కొటేషన్స్ ని ఉటంకిస్తూ.. నరేంద్ర మోడీ తలుచుకుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఒప్పించి, రష్యన్ సైనికులని వెనక్కి పంపించగలరు అంటూ ఒక వీడియో సందేశాన్ని వైరల్ చేయించారు.
ఈ వీడియో భారత్ లో వైరల్ అవడమే కాదు. అదే సమయంలో ఉక్రెయిన్ లో కూడా వాళ్ళ భాషలో వైరల్ చేయించారు. రష్యాలో మీడియా మీద సెన్సార్షిప్ ఉంది కాబట్టి, అక్కడ వైరల్ అయ్యే అవకాశం లేదు. రష్యా లో facebook మీద చాల ఆంక్షలు ఉన్నాయి. చైనా లో లాగా రష్యా లో కూడా సోషల్ మీడియా మీద ప్రభుత్వ నిఘా ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే facebook మీద భారీ జరిమానా విధిస్తారు. కానీ రష్యా,ఉక్రెయిన్ ప్రజల మధ్య బంధుత్వాలు ఉన్నాయి దశాబ్దాలుగా. కాబట్టి ఉక్రెయిన్ నుండి రష్యాలోని వాళ్ళ బంధువులకి మోడీ మధ్యవర్తిత్వం మీద పలు రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా ముందస్తు వ్యూహంగా చేసిందే !
అమెరికా,యూరోపు ని వదిలిపెట్టి కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ నే సంధి చేయమని ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు ? ప్రస్తుతం రష్యాతో మన రక్షణ ఒప్పంద కాంట్రాక్టులు దాదాపుగా $45 బిలియన్ విలువ చేసేవి ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావడానికి 2028 సంవత్సరం వరకు ఆగాలి. దాదాపుగా 20% అడ్వాన్సులు ఇప్పటికే చెల్లించింది భారత్ .ఇక ప్రస్తుతం భారత్ రక్షణ దళాల వద్ద రష్యా మిలటరీ ఎక్విపిమేంట్ శాతం 68 % గా ఉంది.
దశాబ్దాలుగా రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు జరుగుతున్నది కాబట్టి, వాటికి సంబంధించి విడి భాగాలు రష్యా నుండి రావాల్సిందే ! 2014 వరకు ఇది 78 శాతంగా ఉండేది. గత 7 ఏళ్ళుగా చాలా ఆయుధాలు DRDO దాని అనుబంధ విభాగాలు మన దేశంలోనే తయారు చేయడం మొదలు పెట్టడంతో దాదాపుగా 10% ఆయుధాల దిగుమతి రష్యా నుండి దిగుమతి చేసుకోవడం తగ్గింది కానీ రాబోయే 10 ఏళ్ళ వరకు దాదాపుగా రష్యా మీదనే ఆధారపడాల్సి ఉంటుంది విడి భాగాలు కానీ ఆర్డర్ ఇచ్చిన కొత్త ఆయుధాలు కోసం కానీ!
రష్యా ని మన నుండి వేరు చేస్తే, అప్పుడు ఆయుధాలు అమెరికా,EU నుండి కొనాల్సి వస్తుంది. ఇక 2030 నాటికి చాలా ఆయుధాల జీవితం కాలం పూర్తి అయిపోతాయి. అప్పుడు మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉంటుంది.
మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకావాల్సింది ఏమిటంటే.. అమెరికన్ వ్యూహకర్తలు ఎప్పుడూ రాబోయే 30 ఏళ్ళలో ఏ దేశం కి ఎలాంటి ఆయుధాలు అవసరం అవుతాయో ముందే ఒక డాటా ని సిద్ధం చేసుకుంటాయి. దీనికోసం ఒక బృందం నిరంతరం పని చేస్తూ ఉంటుంది.
వీళ్ళ దగ్గర వివిధ దేశాల ఆయుధాల వివరాలు ఉంటాయి. అవి ఎప్పటికి పనికిరాకుండా పోతాయి అనే వివరాలు కూడా ఉంటాయి. ఈ బృందంలో పని చేసేవాళ్ళకి జీతాలు, అమెరికన్ ఆయుధ తయారీదారుల తో పాటు అమెరికన్ ఆయుధ కాంట్రాక్టర్లు కూడా, సమంగా తమ వంతు నిధులని సమకూరుస్తూ ఉంటారు. మరో బృందం వివిధ దేశాల మధ్య శత్రుత్వం మీద నిరంతరం నిఘా వేస్తూ ఉంటారు. తమ ఆయుధాలు అమ్ముడుపోవాలంటే ఏ దేశం ఏ దేశంతో శత్రుత్వం ని పెంచాలి అది ఎలా చేయాలో ఒక వ్యూహం కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. ఇదొక పెద్ద నెట్వర్క్. వీళ్ళకి అమెరికన్ ప్రభుత్వ మద్దతు బలంగా ఉంటుంది.
మళ్ళీ ఇక ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ మీద నరేంద్ర మోదీ విషయానికి వద్దాం ! మోదీజీ ని ఎందుకు ఎంచుకుంది అమెరికా ? రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం మొదటి బాటరీ డెలివరీ ఇవ్వడం కోసం, నెల రోజుల క్రితం పుతిన్ తో పాటు రష్యా రక్షణ మంత్రి,రష్యా విదేశాంగ మంత్రి ధిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేవలం S-400 డెలివరీ కోసం పుతిన్ న్యూ డిల్లీ రావడం కొంచెం విడ్డూరంగా ఉంది అనేది అమెరికా అనుమానం. అయితే అది నిజం కూడా. ఉక్రెయిన్ విషయం మీద మోడీ మద్దతు కోసం మరియు అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చించి, తిరిగి మాస్కో వెళ్ళిపోయాడు పుతిన్. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కోసం పుతిన్ రష్యా వెళ్ళినప్పుడు, ఉక్రెయిన్ విషయం ప్రస్తావనకి వచ్చి ఉండవచ్చు.
ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే.. ప్రస్తుతం రష్యాకి మద్దతుగా నిలిచే రెండు అణ్వాయుధ దేశాలు అవి భారత్,చైనాలు మాత్రమే. ఇదివరకటి రష్యన్ అధ్యక్షుల కంటే పుతిన్ బలంగా విశ్వసించే దేశం భారత్ మాత్రమే ! చైనాని అవసరార్ధం నమ్ముతాడు. ఎందుకంటే రెండేళ్ళ క్రితమే చైనా రష్యాలోని వ్లాడివోస్టక్ ప్రావిన్స్ తమదే అంటూ ప్రకటన చేసింది. రష్యా ఆర్ధికంగా తమ మీద ఆధారపడుతున్నది అనే భావనలో ఉన్న చైనా, ఈ ప్రకటన చేయడం వెనుక ఎప్పటికయినా వ్లాడివోస్టాక్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటాము అనే హెచ్చరిక దాగి ఉంది అని పుతిన్ కి తెలుసు.
చైనా భూభాగం నుండి సముద్ర మార్గం ద్వారా కేవలం ఒక గంటలోపే వ్లాడివోస్టాక్ చేరుకోవచ్చు. 2040 కల్లా రష్యాలోని వ్లాడివోస్టాక్ తో పాటు, భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ ని చైనాలో కలుపుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నది అని పుతిన్ కి తెలుసు. కాబట్టే చైనాని పూర్తిగా నమ్మడు పుతిన్.
మోడీ అవినీతి పరుడు కాదు. గతంలో రక్షణ ఒప్పందాల విషయంలో భారత రాజకీయ నాయకులు ఎలాంటి బేరాలు ఆడింది పుతిన్ కి తెలుసు కాబట్టే మోదీజీ ని బలంగా విశ్వసిస్తాడు పుతిన్.
సరిగ్గా ఈ point ని ఆసరా తీసుకునే అమెరికా,నాటో కూటమి పుతిన్ ,మోదీ మధ్య అభిప్రాయ బేధాలు సృష్టించే పన్నాగంలో భాగంగా ఉక్రెయిన్ చేత బహిరంగంగా ప్రకటన చేయించడం. పైగా ఇప్పటికే ఉక్రెయిన్ ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేయించాడు జేలన్ స్కీ ! మోడీ చెపితే పుతిన్ వింటాడు. కానీ మోడీ పుతిన్ కి చెప్పట్లేదు అంటూ ఉక్రెయిన్ ప్రజల్లో మరియు సైన్యంలో ఈ ప్రచారాన్ని బలంగా వ్యాప్తి చేశారు.
ప్రస్తుతం రష్యా తో పాటు భారత్ ని కూడా, శత్రువుగా చూసే స్థితికి తెచ్చారు అమెరికన్ వ్యూహ కర్తలు. ఇది
పరోక్షంగా మోడీ మీద ఒత్తిడి తెస్తుంది. నిన్న ఉక్రెయిన్,పోలాండ్ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర, భారత విద్యార్ధుల మీద ఉక్రెయిన్ సైనికులు దౌర్జన్యం చేశారు. మీ ప్రధాని మాకు సహాయం చేయనప్పుడు మేము మీకు ఎందుకు సహాయం చేయాలి? అంటూ కేరళ కి చెందిన విద్యార్ధి మెడ పట్టుకొని, గన్ చూపిస్తూ గట్టిగా అరిచాడు. దాంతో తన స్నేహుతుడి మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు అంటూ అతని సహా విద్యార్ధి జోక్యం చేసుకోబోగా, ఇద్దరినీ బలంగా రోడ్డు మీదకి తోసేసారు ఉక్రెయిన్ సైనికులు.
నేను ముందే చెప్పినట్లు అమెరికన్ నెట్ వర్క్ తో పాటు మన దేశంలో ఉన్న ద్రోహులు కూడా ముందు నుండీ ఒక పధ్ధతి ప్రకారం ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయదు అంటూ విష ప్రచారం చేయడంతో, భారత ప్రభుత్వం ముందు నుండి హెచ్చరిస్తున్నా భారత్ విద్యార్ధులు లెక్క చేయలేదు. ఇక్కడంతా బాగానే ఉంది. కానీ భారత్ లో ఎందుకు పానిక్ అవుతున్నారు అంటూ మెడికల్ విద్యార్ధులు ఎదురు ప్రశ్నలు వేస్తూ వచ్చారు తప్పితే, అక్కడ నుండి తిరిగి భారత్ కి రావడానికి ఇష్టపడలేదు. ఇదొక వ్యూహ రచన. విద్యార్ధులని పావులుగా వాడుకొని రాజకీయ లబ్ది పొందాలనే దుష్ట పన్నాగం.
పోలాండ్,రొమేనియా,హంగరీ దేశాల చెక్ పోస్టుల వద్ద భారత్ జెండాతో వచ్చిన వాహనాలని ఎలాంటి చెక్ లేకుండా స్వేచ్చగా వదిలేశారు. ఇది ఉక్రెయిన్ కి కావొచ్చు లేదా అమెరికన్ వ్యూహకర్తలకి కావొచ్చు చాల బాధ కలిగించి ఉండవచ్చు. ఒక్క భారత్ తప్పితే వేరే ఏ దేశమూ, తమ పౌరులని ఉక్రెయిన్ నుండి వెనక్కి తీసుకురావడాని సాహసం చేయలేకపోయాయి. రష్యా తన ఎయిర్ స్పేస్ ని మూసేసింది. కానీ మన ఎయిర్ india విమానం కి మాత్రం అనుమతి ఇచ్చింది విద్యార్ధులని తీసుకురావడానికి.
దీనికి ముందుగానే ప్లాన్ చేశారు అనడానికి ఉదాహరణగా.. ఉక్రెయిన్ మంత్రి మీడియా సాక్షిగా చేసిన ప్రకటన. మా దేశంలో మీ విద్యార్ధులు చదువుతున్నారు అన్నది గుర్తు పెట్టుకోండి అంటూ చేసిన హెచ్చరిక ఒక సారి వీడియో ఇస్తున్నాను మీరు చూడవచ్చు. ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా అని కాచుక్కూర్చున గుంట నక్కలకి, చివరకి విద్యార్ధులు దొరికారు. అయితే అది ఇక్కడతో ఆగిపోలేదు. పరోక్షంగా భారత్ కి సరఫరా చేస్తున్న పొద్దు తిరుగుడు విత్తనాల్ని కూడా టార్గెట్ చేశారు. కానీ …ఇప్పటికే దివాలా తీసే స్థితిలో ఉన్న ఉక్రెయిన్ అంతో కొంతో ఆదాయం వచ్చే పొద్దుతిరుగుడు విత్తనాల సరఫరా ఆపెయగలదా? ఇది చెరువు మీద అలగడం లాంటిదే !
సింహ భాగం ఉక్రెయిన్ నుండే, మన దేశానికి సన్ ఫ్లవర్ ఆయిల్ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. ఇప్పుడు వాటి దిగుమతి తాత్కాలికంగా ఆగిపోవచ్చు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటుంది ఏ దేశం అయినా. మరొక విశ్లేషణ ఏమిటంటే.. భారత విద్యార్ధులని బందీలుగా చేసి భారత్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ! రెండు రకాలుగా ఊహించారు కుట్ర దారులు.
విద్యార్ధులని విడిపించడానికి పుతిన్ మీద తీవ్ర ఒత్తిడి తెస్తాడు మోడీ అని. రెండోది ఖజఖిస్తాన్ లో ఉన్న భారత వాయుసేన ని ఉపయోగించి, ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది అని. కానీ ఎందుకో చివరి క్షణంలో మనసు మార్చుకొని విద్యార్ధులని సురక్షితంగా పంపించింది ఉక్రెయిన్. అసలు ఉక్రెయిన్ లో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్ధులలో ఎక్కువ శాతం భారత్ నుండే. ఆవిధంగా ఉక్రెయిన్ కి విదేశీ మారక ద్రవ్యం రూపేణా డాలర్లు వస్తుంటే, ఇలాంటి పిచ్చి చర్య వల్ల అది కాస్తా ఆగిపోతే, యూనివర్సిటీ మూత పడి పోతుంది.
ఇక మన మాజీ ముఖ్యమంత్రి అల్జిమీర్స్ రోగి, విద్యార్ధులు ప్రయాణించే బస్సులకి, భారత దేశ జెండా ఉంచకండి. పోలాండ్ లో కొడుతున్నారు అంటూ జూమ్ మీటింగ్ లో సలహా ఇస్తున్నాడు ఖర్మ. చాలా వెబ్ న్యూస్ పోర్టల్స్ పోలాండ్ అని వ్రాసాయి థంబ్ నెయిల్స్ లో. కానీ సంఘటన జరిగింది పోలాండ్ ఉక్రెయిన్ చెక్ పోస్ట్ దగ్గర. అదీ ఉక్రెయిన్ భూభాగంలో. పోలాండ్ మనకి మంచి మిత్ర దేశం. గత వందేళ్ళ క్రితం పోలాండ్ వాసులకి గుజరాత్ మహా రాజు ఆశ్రయం ఇచ్చాడు. దానికి గుర్తుగా ఇప్పటికీ పోలాండ్ మన దేశానికి కృతజ్ఞత చూపిస్తూనే ఉన్నది.
ఇప్పటివరకు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నించని విషయం. సోషల్ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను:
‘’ 1960 వ దశకం లో ఆయుధ పరంగా,టెక్నాలజీ పరంగా,ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉన్న సోవియట్ యూనియన్ చూపించి యూరోపులో ఉన్న చిన్న చిన్న దేశాలని భయపెట్టి అమెరికా ఆడిన నాటకం నాటో [North Atlantic Treaty Organisation] అనే ఒప్పందం. అప్పట్లో ఉన్న నాటో దేశాల సంఖ్య ఇప్పుడు ఉన్న నాటో దేశాల సంఖ్య ఎంత ? మరి సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిపోయి 31 ఏళ్ళు అవుతున్నది. మరి ఇంకా ఎందుకు నాటో ని కొనసాగిస్తున్నారు ?” అడగాల్సిన ఇలాంటి ప్రశ్నలని వదిలేసి భారత్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ? భారత్ నాటో సభ్య దేశం కాదు కదా ? అసలు ఉక్రెయిన్ సమస్య రెండు దేశాల మధ్య ఉండాల్సింది. ఎందుకు దానిని ప్రపంచం మొత్తానికి విస్తరిస్తున్నారు ?
వేల బిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారం కోసమే ! అమెరికా కి కానీ యూరోపు కి కానీ పోటీ ఉండకూడదు ! ఆయుధాల ఎగుమతిని అదీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థని ఎగుమతి చేయడం మొదలు పెట్టిన మన దేశం, త్వరలో ఫైటర్ జెట్ లని కూడా ఎగుమతి చేయగల స్థితికి వస్తే, మనల్ని కూడా రష్యా లాగానే ఇతర సమస్య లలోకి లాగి మన మీద ఆంక్షలు విధించరని అనుకోవచ్చా ?
ఖచ్చితంగా మన మీద ప్రయోగిస్తారు. త్వరలో CAATSA ని ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. కాట్సా అనే చట్టం అమెరికా శత్రు దేశాల దగ్గర ఆయుధాలు కొంటే , ఆ దేశం మీద అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించడానికి వీలు కల్పిసుంది.
– పార్ధసారధి పోట్లూరి