Suryaa.co.in

Andhra Pradesh

జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసే కుట్ర

-వన్‌టౌన్‌ రౌడీతో గులకరాయి దాడి ప్లాన్‌
-వెల్లంపల్లి, కేశినేని కాల్‌ రికార్డ్స్‌ను బయటపెట్టాలి
-టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌

జగన్నాటకంతో బలహీన వర్గాలను బలిచేసేందుకు జగన్‌ కుట్ర పన్నుతున్నాడని టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌ మండిపడ్డారు. రూట్‌ మ్యాప్‌ మార్చి కావాలనే కరెంట్‌ కట్‌ చేసి రాయితో దాడి చేయించుకుని సానుభూతి పొందేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బస్సు యాత్రకు ప్రజాదరణ లేకపోవడంతో విజయవాడలో వన్‌టౌన్‌ రౌడీతో రాయి దాడిని జగన్‌ గ్యాంగ్‌ ప్లాన్‌ చేశా రని వివరించారు.

అందులో కోవర్ట్‌ నాని, వెల్లపంల్లి శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర వహించారని విమర్శించారు. వారి కాల్‌ రికార్డ్స్‌ను బయట పెడితే అసలు నిజం బయటకు వస్తుందన్నారు. దాడికి ఉపయో గించిన రాయి ఎక్కడకు పోయింది? అని ప్రశ్నించారు. దాడి అనంతరం ప్లకార్డులతో వెంటనే చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు తెరలేపారన్నారు. బీసీ బిడ్డలను బలిచేసేందుకు కుట్ర పన్ని టీడీపీపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారరు. ఈ వ్యవహారంలో బొండా ఉమామహేశ్వరరావును ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా విజయవాడ వెస్ట్‌ ను దోచుకున్న వెల్లంపల్లికి వచ్చే ఎన్నికల్లో బొండా తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

LEAVE A RESPONSE