ప్రతిపౌరుడు తలెత్తుకొని గౌరవంగా జీవించడం రాజ్యంగం పుణ్యమే

-పుట్టుకతోనే రాజకీయ, ఆర్దిక, సమానత్వం కల్పించిన రాజ్యంగం
-ప్రపంచ దేశాలు భారత రాజ్యంగం వైపు చూస్తున్నాయి
-రాజ్యాంగం మూల సిద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతం
-రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బిజెపి విధానాలను తిప్పి కొడుదాం

దేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొని గౌరవంగా జీవిస్తున్నారంటే ఈ దేశానికి కాంగ్రెస్ ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పుణ్యమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ గాంధిభవన్లోని ఇందిర భవన్లో టిపిసిసి ఆద్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడారు.

భారత రాజ్యంగ రక్షణే దేశ రక్షణ అని అన్నారు. రాజ్యంగం దేశ ప్రజలకు గొప్ప వరమన్నారు. పాకిస్తాన్, భారతదేశానికి ఒకే రోజు స్వాతంత్రం వచ్చినప్పటికీ అనేక మార్లు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆర్మి సైన్యం తమ గుప్పిట్లోకి తీసుకొని దేశ అధ్యక్షులను దించివేశారని, కొన్ని చోట్ల దేశ అధ్యక్షులను ఉరితీసిన ఘటనలను చూశామన్నారు. కానీ ప్రజాస్వామ్యయుతంగా మన దేశంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయని అధికార మార్పిడి జరిగే క్రమంలో మనదగ్గర ఏలాంటి చిన్న అలజడి కూడ జరుగలేదంటే అందుకు కారణం రాజ్యగమేనని, రాజ్యంగంలో పొందుపరిచిన అంశాలే కారణమన్నారు.

ఫుట్టుకతోనే రాజకీయ, ఆర్దిక, సమాజిక అంశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం కల్పించిన మహాగ్రంథం రాజ్యంగమని దాని విశిష్టత గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. రాజ్యంగం అమలుకాక ముందు దేశంలో మానవ జీవన ప్రమాణ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే శిక్షించే అసమానతలను తొలగించే విధంగా సమానత్వం కల్పించిన అధ్బుత గ్రంథమే రాజ్యాంగమన్నారు. మత గ్రంథాల ఆదారంగా పుట్టుకతోనే ఆర్ధికంగా దూరంగా నెట్టివేయబడిన సమాజం నుంచి అందరికి సంపదపై సమానత్వం కల్పించింది రాజ్యంగమన్నారు.

సామాన్యుడు, సంపన్నుడు అని వ్యత్యాసం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా అందరికి సమాన ఓటు హక్కు కల్పించి సామాన్యులకు సైతం రాజకీయాధికారం కల్పించింది రాజ్యంగమేనని వివరించారు. మనుధర్మ సంక్లిష్ట గ్రంథంలో మనిషిని మనిషిగా గౌరవించని అంశాలను చట్టపరంగా నేరమని వాటిని అమలు చేస్తే శిక్షింపబడుతారని చెప్పింది కుడా రాజ్యంగం మాత్రమే అని అన్నారు. మన ఆలోచనలు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయడం, మనకిష్టమైన మతాలను విశ్వసించడం, ఆరాధించడం రాజ్యంగం ద్వారా వచ్చిన స్వేచ్ఛ అని తెలిపారు. అణగారిన వర్గాల ప్రజలు దేశంలో తలెత్తుకొని గౌరవంగా జీవించే విధంగా భారత రాజ్యంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. ఈ దేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొని గౌరవంగా జీవిస్తున్నారంటే ఈ దేశానికి కాంగ్రెస్ ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పుణ్యమేనని పుణరుద్ఘాంటించారు.

ప్రపంచ దేశాలు సైతం భారత రాజ్యాంగం మా దేశంలో ఉంటే బాగుండు అని కోరుకుంటున్నయంటే మన రాజ్యంగానికి ఉన్న గొప్పతనమే అన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన అంబేద్కర్ గారికి దేశ ప్రజలు ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు రుణపడి ఉండాల్సిందేనని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సమానత్వం కల్పించిన రాజ్యాంగాన్ని అందించడంతో పాటు దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి సైతం ప్రజలు నిబద్ధత కలిగి ఉండాలని కోరారు.

భారత రాజ్యంగాన్ని మార్చలన్న కుట్ర
భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాధ దర్శశాస్ర్తాన్ని నిర్మాణం చేసి దేశ ప్రజలకు రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం సమానత్వాన్ని దూరం చేయడానికి కుట్రలు చేస్తున్న బిజెపి పాలకుల ప్రయత్నాలను తిప్పికొట్టి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులపై ఉందని తెలిపారు. భారత రాజ్యాంగం స్ఫూర్తితో పరిపాలన చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద శాస్త్రాన్ని తిరిగి నిర్మాణం చేయాలని బిజెపి చేస్తున్న కుట్రల వల్ల దేశంలో కోట్లాదిమంది జీవన ప్రమాణ పరిస్థితులు తారు మారయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అందించిన మహాగ్రంధమైన భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రధాని మోడీ పారిపాలన సాగుతుందన్నారు. 8సంవత్సరాల మోడీ పరిపాలనలో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం హరింపబడుతున్నాయని వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ ప్రశ్నించేవారిపై కేసులు, ప్రతిపక్ష నాయకుల గొంతులను నొక్కడానికి సిబిఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలతో దాడులకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. తినే తిండిపై, ఆరాదించే దేవుడిపైన కూడ ఆంక్షలు పెడుతూ పౌరుల స్వేచ్ఛను బిజెపి ప్రభుత్వం హరిస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలో స్వేచ్ఛలేకుండ చేస్తున్నారని మోడీ సర్కార్ పై మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం కల్పించడానికి భూసంస్కరణలు, 20 సూత్రాల అమలు, బ్యాంకుల జాతీయకరణ చేశారని గుర్తు చేశారు. కానీ, బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఆర్ధిక అసమానతలు పెంచి పోషిస్తున్నదని ఇది దేశానికి మంచిది కాదన్నారు. నవభారత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ తన స్నేహితులైన క్రోని క్యాప్టలిస్టులకు దారదత్తం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాడని ద్వజమెత్తారు. 8సంవత్సరాల్లో కేవలం సాధరణ వ్యాపారవేత్తగా ఉన్న ఆదానీ ప్రపంచంలో 2వ కుబేరుడుగా ఎదగడం ఇదే నిదర్శనమన్నారు.

కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టిన సొమ్ముతో వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టి సామాన్యులకు రాజకీయ అవకాశాలు లేకుండా బిజెపి చేస్తున్నదన్నారు. బడుగు బలహీన, బహుజనుల అవకాశాలు కొల్లగొట్టి కొంతమందికి మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా మను ధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు బిజెపి ముందుకు తీసుకురావడంలో భాగమేనని తెలిపారు. రాజకీయ సమానత్వం కాంగ్రెస్ పరిపాలనలో మాత్రమే అమలైందన్నారు. రాజకీయ సమానత్వంలో అత్యంత పేదవాడు సైతం ఎన్నికల్లో గెలిచేలా ఉండాలన్నారు. కానీ ఇప్పుడు కార్పేరేట్ ఆశీస్సులు ఉన్న వారు మాత్రమే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించే సంప్రాదాయాన్ని బిజెపి తీసుకువస్తున్నదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం సమానత్వాన్ని దూరం చేస్తున్న బిజెపి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళడం దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన భాధ్యత అని అన్నారు. రాజ్యాంగం మూల సిద్ధాంతమే కాంగ్రెస్ మూల సిద్ధాంతమని, ఈ సిద్ధాంతాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని కాంగ్రెస్ శ్రేణులతో ఆయన ప్రమాణం చేయించారు.

టిపిసిసి వర్కింగ్ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, పిసిసి మాజీ అద్యక్షులు వి.హెచ్ హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, గీతారెడ్డి, గడ్డం వినోద్, వర్కింగ్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, టిపిసిసి ఉపాధ్యాక్షులు మల్లు రవి, నీరంజన్ రెడ్డి మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు సునీతరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి , కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఎన్ఎస్ య ఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఫిషరీస్ కమిటి చైర్మెన్ మెట్టు సాయికుమార్, ఎస్టీ సెల్ చైర్మెన్ జగన్ లాల్ నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సోహేల్, నాయకులు భూపతిరెడ్డి, గంగదేవుల లోకేష్ యాదవ్, జైపాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.