-వెనుకబడిన వర్గాలపై ఎనలేని అపేక్ష గల సీఎం కేసీఆర్
-ఈ నెలాఖరులోపు ప్రభుత్వం నిర్మించే భవనాలకు టెండర్ ప్రక్రియ పూర్తి
-ఏక సంఘాల ట్రస్టులు పనులు ప్రారంభించాలి
-అప్రోచ్ రోడ్లు, విద్యుత్ ఇతర మౌళిక వసతుల్ని నెలాఖరులోపు పూర్తి చేయాలి
-వేలకోట్ల విలువైన కోకాపేట, ఉప్పల్ భగాయత్లో 87.3 ఎకరాలు, 95 కోట్లు
-బీసీ ఆత్మగౌరవ భవనాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపేలా సీఎం కేసీఆర్ గారు సంకల్పించిన బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై నేడు తన అధికారిక నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ ఇన్ర్పాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఈ నెలాఖరు కల్లా అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసుకొని మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు మంత్రి గంగుల.
వెనుకబడిన వర్గాలపై ఆపేక్షతో వేల కోట్ల విలువ చేసే కోకాపేట, ఉప్పల్ బగాయత్ లాంటి విలువైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ 87.3 ఎకరాలు, 95.25 కోట్లను 41 బీసీ సంఘాలకు కేటాయించారన్నారు మంత్రి గంగుల. వీటిలో ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మించుకోవడానికి కుల సంఘాల ట్రస్టులకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించామన్న మంత్రి 13 సంఘాలు సొంతంగా భవానాల్ని నిర్మించుకుంటున్నాయని మిగతా భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. వీటిలో ఇప్పటికే 10 ఎకరాలు 10 కోట్లతో యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను కోకాపేట్లో తీర్చిదిద్దామని ఇవి తుది ధశలో ఉన్నాయని, మరో 3 సంఘాల భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచామన్నారు. మిగతా 18 సంఘాలకు సైతం నెలాఖరులోపు టెండర్లు ఖరారు చేయాలని అదేశించారు, అదేవిదంగా ట్రస్టులు ఈనెల 5 మరియు 7 తారీఖుల్లో భూమిపూజ పూర్తి చేసుకున్నాయని, వీటిలో ఆత్మగౌరవ భవన నిర్మాణాలను సైతం మార్చి నుండి ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఇప్పటికే కోకాపేట, ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ అభివ్రుద్ది పనులను చేపట్టిందని, కోకాపేట్లోని ప్రతీ ఆత్మగౌరవ భవనానికి అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విధ్యుత్ వంటి మౌళిక సధుపాయాల్ని ఈ నెలాఖరుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్లు నిరంతరం ఆయా కుల సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ వారి కుల ఆత్మగౌరవం ఇనుమడించేలా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డీడీ సంద్య, రజక ఫెడరేషన్ ఎండీ చంధ్రశేఖర్, టీఎస్ డబ్ల్యూఐడీసీ సీఈ అనిల్ కుమార్, ఈఈ కుమార్ గౌడ్, ఎస్. ఈ శైలెందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.