Suryaa.co.in

Telangana

మూసీపై కొత్త బ్రిడ్జి నిర్మాణం

– మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ

మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనది పై నూతన బ్రిడ్జిల ను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉదృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా మంజురైన బ్రిడ్జి నిర్మాణాలను 10 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. భారీ వర్షాలు కురిసి ఊహించని విధంగా మూసీ నదికి వరదలు రావడం వలన ముసరాం బాగ్ వంతెన, పటేల్ నగర్, గోల్నాక తదితర పరిసర ప్రాంతాలు ముంపుకు గురై ఇండ్లలోకి నీరుtsy1 చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించారు. తద్వారా ఈ వంతెన పై నుండి రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యెక చొరవతో ప్రభుత్వం ముసరాం బాగ్ వంతెన నిర్మాణం కోసం 52 కోట్లు, చాదర్ ఘాట్ వంతెన కోసం 42 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు.

ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను 10 రోజులలో ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ వంతెనలు అందుబాటులోకి వస్తే రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండబోదని స్పష్టం చేశారు. మూసీనది వెంట ఉన్న కాలనీలు, ఇండ్లు ముంపుకు గురికాకుండా మూసీనది వెంట అవసరమైన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. గతంలో భారీ వర్షాలు వస్తే నగరంలో ప్రజలు అనేక అవస్థలు పడేవారని, తెలంగాణా ప్రభుత్వం GHMC, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని వివరించారు. అంతేకాకుండా ద్వంసమైన రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మత్తులను చేపడుతున్నట్లు చెప్పారు.

నగరంలోని పలు నాలాలకు ఎగువనుండి వచ్చే వరదతో పరిసరాలలోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ సమస్య పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ KTR చొరవతో చేపట్టడం జరిగిందని వివరించారు. వచ్చే జూన్, జులై నాటికి నాలాల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE