Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించండి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్ కు లేఖ రాసిన టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర

ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్శిటీ పేరు మార్చడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మేరకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీందర్‌ లేఖ రాశారు. కనకమేడల లేఖ సారాంశం ఇదీ.

ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి, ఆయనను అవమానించేందుకే యూనివర్శిటీకి పేరు మార్పు చేశారు. పేదలకు మెరగైన వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే ప్రప్రధమంగా 1986 లో అన్ని మెడికల్ కాలేజీలను ఎన్టీఆర్ యూనివర్శిటీ కిందకు తీసుకొచ్చారు. నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైద్యరంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా వైద్య విద్యార్ధులకు, పేదవర్గాలకు ఎంతగానే ఉపయోగపడింది. ఒక దశాబ్దకాలం తర్వాత ఈ సంస్థ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరొంది దేశ విదేశాలలో వేల మంది వైద్యవిద్యార్ధులు అనేక కీలక పదవులలో స్థిరపడ్డారు.

గత మూడున్నర సంవత్సరాలు ఈ పేరు మరింత ఇనుమడించింది.ఇంతలోనే ఎన్టీఆర్ హల్త్ యూనివర్శిటీ పేరును డా.వై.ఎస్.ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్పు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పేరు మార్పుకు వైసీపీ ప్రభుత్వంవ చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. పేరు మార్పుపై పూర్వ విధ్యార్ధులకు గానీ, ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ గానీ చేయలేదు.పేరు మార్పుతో గత నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే కాకుండా దేశ విదేశాలలో వైధ్య విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒక విద్యాసంస్థ బ్రాండ్ ఇమేజ్ ను బట్టి ఆ విధ్యార్ధుల భవిష్యత్తు ఎంతగా ఆధారపడి ఉంటుందో మాకంటే మీకు బాగా తెలుసు.

దేశ విదేశాలలో ఎన్టీఆర్ అన్న పేరుకు ఎంతో ఉన్నతమైన పేరు, వ్యక్తిత్వం ఉన్నాయి.ఎన్టీఆర్ అన్న పేరు ప్రతీ తెలుగువాడి, ప్రతీ భారతీయుడి హృదయాలను టచ్ చేసే పేరు.ఇంతటి గొప్ప మహోన్నతమైన పేరు మార్పు చేయడాన్ని ఊహించుకోలేకున్నాం. కావున, దీనిపై తమరు జోక్యం చేసుకుని పేరు మార్పును నిలుపుదల చేసి సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడగలరని వినతి.

LEAVE A RESPONSE