Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం

– ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ సంస్థ సహకారంతో నిర్మించిన మోడ్రన్ అంగన్వాడీ స్కూల్ ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే రాము, ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ కబీర్ బేడి
– ప్రజలకు మంచి చేయాలనుకునే సంస్థలకు… రాము లాంటి ప్రజా ప్రతినిధుల సహకారం ఎనలేనిది: యాక్టర్ కబీర్ బేడీ

గుడ్లవల్లేరు: రాష్ట్రంలోని పేద వర్గాలకు ఆర్థిక ప్రగతిని చేకూర్చేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందిస్తున్న సహకారం అభినందనీయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ సంస్థ సహకారం రూ.30 లక్షల నిధులతో గుడ్లవల్లేరు మండలం ఇందిరానగర్ లో నిర్మించిన అంగన్వాడి ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి, ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం ప్రారంభించారు.

అనంతరం ప్రైమరీ పాఠశాలలోని ఇతర విభాగాలను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆహ్లాదకరమైన వాతావరణం మరియు సదుపాయాలను నాయకులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా గుడివాడలో ప్రజలకు మంచి చేసే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కేర్ సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. కేర్ టు యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమంలో ఇండియా స్టైలిష్ లెజెండరీ యాక్టర్ కబీర్ బేడి గుడ్లవల్లేరు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హార్షం వ్యక్తం చేశారు.

కేర్ సంస్థ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని.. ప్రజల మంచి కోసం పనిచేస్తున్న వారితో కలిసి నడిచేందుకు తాను సిద్ధం ఉన్నానని సభాముఖంగా ఎమ్మెల్యే రాము ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రకటనతో కేర్ సంస్థ ప్రతినిధులు హార్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజలకు మేలు చేయాలనుకునే తమలాంటి సంస్థలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లాంటి ప్రజాప్రతినిధులు సహకారం ఉంటే… ప్రజలకు మేలు చేసేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుందని బాలీవుడ్ యాక్టర్ కేర్ సంస్థ గ్లోబల్ అంబాసిడర్ కబీర్ బేడి అన్నారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్..కేర్ టు యాక్షన్ సంస్థ గ్లోబల్ అంబాసిడర్ రోమినా పవర్, ప్రతినిధులు రోసారియో జక్కా,టిజియానా స్టాఫోలనీ,పర్వీన్ దుసంజ్,టిజియానా నిన్ని,యారి కారిస్సీ,కార్మెలా లిండా మోండెల్లి,డారియో బియాంచిని,కళామణి, మండల కూటమి పార్టీల నాయకులు పొట్లూరి రవి ,జంగం మోహనరావు,చాపరాల బాలాజీ,వల్లభనేని వెంకట్రావు,బొర్రా నాగేశ్వరరావు వల్లభనేని సుబ్బారావు , పొలవరపు వెంకట్రావు
పళ్ళెం నరసింహారావు ,చాపరాల రాజా , పరంధామయ్య, దివ్య చౌదరి, శశికళ కళ్యణపు నవాబు, నాగూర్, శాయన శ్రీహరి, రావాడ గోపాల్, దాసరి మల్లి, తుమ్మపూడి నాని, నాగేశ్వరావు పలువురు మండల ప్రముఖులు, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE