Suryaa.co.in

Telangana

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు బెయిల్

– మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం సూచన
– 41 సి ఆర్ పి సి నోటీస్ ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేశారు
– రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు పోలీసులు కోర్టుకు సమర్పించలేదు
– రాజాసింగ్ న్యాయవాది కరుణ సాగర్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేయగా, సాయంత్రానికి కోర్టు ఆయనకు 20 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

రాజాసింగ్ తరుపు న్యాయవాది కరుణ సాగర్ మాట్లాడుతూ ఏమన్నారంటే…
రాజాసింగ్ రిమాండ్ ను రిజెక్ట్ చేయాలంటూ వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాజాసింగ్ కు 41 సి ఆర్ పి సి నోటీస్ ఇవ్వకుండా అక్రమ అరెస్టు చేశారు అంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. ఒక ప్రజాప్రతిని అరెస్టు చేయాలంటే 41 సి ఆర్ పి సి కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పోలీసులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను పాటించకుండా అరెస్టు చేశారు. తమ వాదన లకు ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. 20000 సొంత పూచి కత్తులు సమర్పించాలంటూ కోర్టు ఆర్డర్ చేసింది.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం సూచన చేసింది.ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వీడియోకు సంబంధించి న్యాయస్థానంలో ఎలాంటి వాదనలు జరగలేదు.రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటివరకు పోలీసులు కోర్టుకు సమర్పించలేదు. కేవలం రాజసింగ్ రిమాండ్ ను రిజెక్ట్ చేస్తూ తమ వాదనలు వినిపించాం. 20వేల పూచి కత్తల తోటి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

LEAVE A RESPONSE