– లిక్కర్ మాఫియాలో సీఎం కేసిఆర్ ప్రమేయం కూడా
– బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ
బండి సంజయ్ ను అప్రజాస్వామికంగా అమానవీయంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.నిన్న ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియా లో కీలక సూత్రధారి అని ఢిల్లీ ఎంపి అరోపణలు చేసిన నేపథ్యంలోనే, ప్రజల దృష్టిని మరల్చేందకు బండి సంజయ్ యాత్రను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు, మహిళా మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తోంటే, అక్రమంగా దాడిచేసి గాయపర్చి కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయడం. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం అప్రజాస్వామికం.
లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఉంది. రాష్ట్రంలో లిక్కర్ పాలసీతో అందర్నీ తాగుబోతులను తయారుచేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర యదావిధిగా జరుగుతుంది. లిక్కర్ మాఫియాలో సీఎం కేసిఆర్ ప్రమేయం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉంది.పోలీసులు గౌరవాన్ని కాపాడుకోవాలి.